Advertisement

కరోనా కాలం... కొత్త రాజకీయం!

Apr 26 2020 @ 01:51AM

బస్సు రూట్ల జాతీయీకరణ నిర్ణయంపై న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలతో నీలం సంజీవ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రైవేటు వైద్య కళాశాలలకు అనుమతి ఇచ్చిన వ్యవహారంలో హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డి సైతం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇది ఒకప్పటి మాట! ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇస్తున్న తీర్పులు, చేస్తున్న వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రోజూ రాజీనామా చేయాల్సి ఉంటుంది. అందుకు విరుద్ధంగా హైకోర్టుతో ఢీకొనడానికే జగన్మోహన్‌ రెడ్డి సిద్ధపడుతున్నారు. దాదాపు ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను 50కి పైగా సందర్భాలలో హైకోర్టు తప్పుబట్టింది. పంచాయతీ కార్యాలయాలకు రంగుల విషయమై తాజాగా జారీచేసిన జీవో ఎటువంటి వివాదానికి దారితీస్తుందో తెలియదు. ఉన్నత న్యాయస్థానం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటే అది ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకు మధ్య సంఘర్షణకు దారితీయవచ్చు. తన ఎజెండా అమలు విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఎంత దూరమైనా వెళ్తారని పలు ఉదంతాలు రుజువు చేస్తున్నాయి.


సుజనా చౌదరి అప్పట్లో తప్పులు చేశారని ఇప్పుడు చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి కూడా విజయసాయిరెడ్డి పరోక్షంగా హెచ్చరికలు పంపారా? అన్న సందేహాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. తాను జగన్మోహన్‌ రెడ్డి చేతిలో కీలుబొమ్మ కాదని పదిమందికి తెలియజేయడంతోపాటు తనను తక్కువగా అంచనా వేయవద్దని జగన్మోహన్‌ రెడ్డికి తెలియజెప్పడానికే పాత విషయాలను విజయ సాయిరెడ్డి ఎత్తి చూపుతున్నారని అభిప్రాయపడుతున్నారు. సుజనా చౌదరిపై ఆరోపణలు నిజమా? కాదా? అన్నది పక్కనపెడితే, వాటిని ఇప్పుడు వెల్లడిస్తున్న విజయ సాయిరెడ్డి భవిష్యత్తులో జగన్మోహన్‌ రెడ్డితో చెడితే ఆయన వ్యవహారాలను సైతం బయట పెట్టరని గ్యారంటీ ఏమి ఉందని గుంటూరుకు చెందిన నా మిత్రుడొకరు సందేహం వ్యక్తంచేశారు. ఇదే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తంచేస్తున్నారు కూడా! లోగుట్టు పెరుమాళ్లకు ఎరుక అన్నట్టుగా జగన్‌ గుట్టు అంతా విజయసాయిరెడ్డి గుప్పెట్లో ఉందన్నమాట.


మంత్రులు, శాసనసభ్యులు లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి భౌతిక దూరాన్ని పాటించక పోవడంపై వస్తున్న విమర్శలు జగన్మోహన్‌ రెడ్డి చెవికి ఎక్కడం లేదు. అధికార పార్టీ నాయకుల వైఖరి కారణంగా చిత్తూరు, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కరోనా వైరస్‌ విజృంభిస్తున్నప్పటికీ భౌతిక దూరాన్ని పాటించాలని జగన్మోహన్‌ రెడ్డి నోరుతెరిచి తన పార్టీ నాయకులకు ఒక్కమాట కూడా చెప్పకపోవడాన్ని ఎలా అర్థంచేసుకోవాలి? కరోనా పుణ్యమా అని ఇప్పుడు సమాజంలో అందరూ అంటరానివారయ్యారు. మనుషులు ఒకరినొకరు ముట్టుకోవాలంటే హడలిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నాయకులకు మాత్రం ఈ మార్పు మినహాయింపు! అందుకే వారు ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుని ఊరేగింపులు, ర్యాలీలు చేస్తున్నారు.


రాజ్యసభలో ప్రభుత్వ బిల్లులు పాస్‌ కావాలంటే వైసీపీ సహకారం బీజేపీ ప్రభుత్వానికి అవసరం. ఈ కారణంగానే ఉభయ పక్షాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిని ప్రదర్శిస్తూ ఉండవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలన్నీ కేంద్ర ప్రభుత్వ ఆమోదంతోనే అమలవుతున్నాయన్న అభిప్రాయం కూడా ఈ సందర్భంగా వ్యక్తమవుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రమేశ్‌ కుమార్‌ను తొలగించి జస్టిస్‌ కనగరాజ్‌ను నియమించే విషయం కూడా కేంద్ర ప్రభుత్వానికి చెప్పే చేశామని రాష్ట్ర ప్రభుత్వం ఒక సందర్భంగా స్పష్టం చేసింది. ఇందులో వాస్తవం లేకపోతే, ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌పై రాష్ట్ర గవర్నర్‌ అంత హడావుడిగా సంతకం చేసి ఉండేవారు కాదేమో! బీజేపీ కేంద్ర నాయకత్వానికీ, వైసీపీ అధిష్ఠానానికీ మధ్య ఇంత సఖ్యత ఉన్న విషయం నిజమైన పక్షంలో రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.


కరోనా మహమ్మారి నుంచి బయటపడటం ఎలా? అని మన దేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ తలలు పట్టుకుంటే... ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రాజకీయ పార్టీలు సిగపట్లకు దిగుతున్నాయి. ఆ రాష్ట్ర రాజకీయాలకు ఈ పరిస్థితి అద్దంపడుతోంది. ఆ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్నప్పటికీ అధికార పార్టీకి చెందినవారు భౌతిక దూరం పాటించకుండా వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్నారన్నది ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. ఈ విమర్శలు కొనసాగుతుండగానే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ భగ్గుమన్నారు. దీంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్థం కొనసాగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులలో నెలకొన్న అంతర్గత విభేదాలు కూడా ఈ సందర్భంగా బయటపడ్డాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నుంచి కన్నా లక్ష్మీనారాయణ 20 కోట్ల రూపాయలు తీసుకుని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అకారణంగా నిందిస్తున్నారని విజయ సాయిరెడ్డి తీవ్ర ఆరోపణ చేశారు.


ఈ విషయమై పార్టీలోని కొంతమంది నాయకులు పరోక్షంగా వైసీపీతో చేతులు కలిపి కన్నాకు మద్దతుగా నిలబడలేదన్న ఫిర్యాదు కూడా బీజేపీ అధినాయకత్వం వద్దకు చేరింది. అధిష్ఠానం ఎవరికి ఏమి చెప్పిందో తెలియదుగానీ వివాదం సద్దుమణిగింది. ఏడాది క్రితం జరిగిన ఎన్నికల సందర్భంగా బీజేపీ అధిష్ఠానం పంపిన డబ్బును లక్ష్మీనారాయణ, దగ్గుబాటి పురందేశ్వరి వంటివాళ్లు సొంతానికి వాడుకున్నారని విజయ సాయిరెడ్డి మరో తీవ్ర ఆరోపణ చేశారు. అది నిజమైనా ఆ వ్యవహారం బీజేపీ అంతర్గత విషయం అవుతుంది. ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీలు తమ అభ్యర్థులకు ఆర్థిక సహాయం చేయడం సహజంగా జరుగుతున్నదే! ఈ ఇరువురు నాయకులు నిధుల దుర్వినియోగానికి పాల్పడివుంటే, అది ఆ పార్టీ నాయకత్వం తేల్చుకుంటుంది. ఈ విషయాన్ని మిత్రపక్షం కూడా కాని వైసీపీకి చెందిన విజయ సాయిరెడ్డి ఎందుకు ప్రస్తావించారో తెలియదు. బీజేపీ రాష్ట్ర నాయకులకంటే ఆ పార్టీ అధిష్ఠానానికి తానే సన్నిహితం అని చెప్పుకోవడానికి విజయ సాయిరెడ్డి అలా అన్నారేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తంమీద ఉభయ పక్షాల మధ్య సాగిన ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వంలో ఏమీ తేలకుండానే ఇరు పార్టీల నాయకులు మౌనాన్ని ఆశ్రయించారు. విజయ సాయిరెడ్డి ప్రకటనలతో తమ పార్టీ అధిష్ఠానానికి తమకంటే ఆయనే ముఖ్యం కాబోలు అన్న సందేహం వస్తోందని స్థానిక బీజేపీ నాయకులు కొందరు చెప్పుకొచ్చారు.


నిజానికి కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర చేస్తే, అవినీతి కేసులలో ముద్దాయిలుగా ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి, విజయ సాయిరెడ్డికి శిక్ష వేయించగలరన్న అభిప్రాయం అందరిలోనూ ఉంది. గతంలో తమిళనాడులో జయలలిత మరణానంతరం తమ దారిలోకి రాని శశికళపై ఉన్న పాత కేసులను అప్పటికప్పుడు తిరగదోడి జైలుశిక్ష పడేలా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తుచేస్తున్నారు. జగన్‌, విజయ సాయిరెడ్డిలపై ఉన్న కేసుల విచారణ ఏళ్ల తరబడి సాగుతూనే ఉంది. అయినా శశికళ ఉదంతం తెలిసి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపైనే ఏకంగా విమర్శలు చేయగల ధైర్యం విజయ సాయిరెడ్డికి వచ్చిందంటే... ఆ పార్టీ అధిష్ఠానం వద్ద ఆయనకు ఉన్న పట్టు కారణమన్న అనుమానం ఎవరికైనా ఎందుకు రాకుండా ఉంటుంది!? 


మీకు మేమూ... మాకు మీరూ!

రాజ్యసభలో ప్రభుత్వ బిల్లులు పాస్‌ కావాలంటే వైసీపీ సహకారం బీజేపీ ప్రభుత్వానికి అవసరం. ఈ కారణంగానే ఉభయ పక్షాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిని ప్రదర్శిస్తూ ఉండవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలన్నీ కేంద్ర ప్రభుత్వ ఆమోదంతోనే అమలవుతున్నాయన్న అభిప్రాయం కూడా ఈ సందర్భంగా వ్యక్తమవుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రమేశ్‌ కుమార్‌ను తొలగించి జస్టిస్‌ కనగరాజ్‌ను నియమించే విషయం కూడా కేంద్ర ప్రభుత్వానికి చెప్పే చేశామని రాష్ట్ర ప్రభుత్వం ఒక సందర్భంగా స్పష్టం చేసింది. ఇందులో వాస్తవం లేకపోతే, ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌పై రాష్ట్ర గవర్నర్‌ అంత హడావుడిగా సంతకం చేసి ఉండేవారు కాదేమో! బీజేపీ కేంద్ర నాయకత్వానికీ, వైసీపీ అధిష్ఠానానికీ మధ్య ఇంత సఖ్యత ఉన్న విషయం నిజమైన పక్షంలో రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. రాష్ట్రంలో వైసీపీ–తెలుగుదేశం పార్టీలకు ప్రత్యామ్నాయంగా తాము ఎదుగుతున్నామని బీజేపీ రాష్ట్ర నాయకులు ఇంతకాలంగా చెబుతూ వచ్చారు. నిజానికి రాష్ట్రంలో బీజేపీ బలపడిందని చెప్పడానికి ఆధారాలు లేవు. కేంద్రంలో అధికారంలో ఉన్న కారణంగా బీజేపీ రాష్ట్ర నాయకులకు కొంత ప్రాధాన్యం లభిస్తోంది.


మిగతా పార్టీలను ఏ మాత్రం లెక్కచేయని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సైతం బీజేపీ విషయంలో నోరు మెదపకపోవడాన్ని గమనిస్తున్నాం. ఈ నేపథ్యంలో విజయ సాయిరెడ్డి చేసిన తీవ్ర ఆరోపణలతో రెండు పార్టీల మధ్య చెడిందా? అన్న అనుమానాలు తొలుత వ్యక్తమైనా, చివరకు కథ సుఖాంతం అవడంతో అందులో నిజంలేదని భావించే పరిస్థితి ఏర్పడింది. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం నాయకులు, అధికార వైసీపీ నాయకుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. వీటిని ప్రజలు కూడా పెద్ద సీరియస్‌గా తీసుకోరని గత అనుభవాలు రుజువు చేస్తున్నాయి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్‌ రెడ్డి హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో నివసిస్తూ విమర్శలు చేయడం ఏమిటని తెలుగుదేశం నాయకులు ఆక్షేపించేవారు. ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయింది. లాక్‌డౌన్‌కు ముందు హైదరాబాద్‌ వచ్చిన చంద్రబాబు ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. హైదరాబాద్‌ నుంచి ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేస్తున్నారు. సలహాలు కూడా ఇస్తున్నారు. దీనిపై వైసీపీ నాయకులు స్పందిస్తూ హైదరాబాద్‌లో కూర్చొని రాజకీయం చేయడం ఏమిటి? అని విమర్శిస్తున్నారు. మొత్తంమీద అప్పటికీ, ఇప్పటికీ పాత్రధారులు మారారు తప్ప విమర్శలు అవే! ఈ విషయం అలా ఉంచితే, బీజేపీ–వైసీపీ మధ్య మొదలైన లడాయి 


టీ కప్పులో తుఫానుగా తేలిపోవడంతో, ఉభయ పక్షాల మధ్య ఢిల్లీస్థాయిలో లోతైన అవగాహన ఉందని మాత్రం స్పష్టమవుతోంది. దీంతో రాష్ట్రంలో బీజేపీ బలపడటం అనేది ఇప్పట్లో జరగదన్న అనుమానాలు మొదలయ్యాయి. జాతీయ పార్టీలకు ఢిల్లీ పీఠమే ప్రధానం కనుక కేంద్రంలో అధికారానికి ఢోకా లేనంతవరకు రాష్ట్రాలలో పాగావేసే విషయంలో అంత పట్టుదలగా ఉండవు. కాంగ్రెస్‌తో పోల్చితే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విషయం కొంత విభిన్నం. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు పార్టీని విస్తరించాలని ఈ ఇరువురు నాయకులు పట్టుదలతో వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న పరిణామంతో రాష్ట్రంపై మోదీ–షా ద్వయం ఆశలు వదులుకున్నదని భావించాల్సిన పరిస్థితి ఉంది.


విజయసాయి వ్యాఖ్యల వెనుక...

విజయ సాయిరెడ్డి లోతైన మనిషి! కేంద్రం అనుమతితోనే ముఖ్యమైన నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నట్టుగానే... బీజేపీ పెద్దల అనుమతితోగానీ, లేదా వారికి చెప్పి గానీ విజయ సాయిరెడ్డి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై ఆరోపణలు చేసి ఉండవచ్చుగా! ఆ విషయం ఎలా ఉన్నా తెలుగుదేశం నుంచి బీజేపీలో చేరిన ఎంపీ సుజనా చౌదరిపై విజయ సాయిరెడ్డి చేసిన విమర్శల వెనుక మర్మం ఏమై ఉంటుందా? అని వైసీపీ నాయకులు కొందరు మధనపడుతున్నారు. ఒకప్పుడు తాను సుజనా చౌదరికి చెందిన కంపెనీలకు ఆడిటర్‌గా పనిచేశాననీ, బోగస్‌ కంపెనీలు ఏర్పాటు చేయడంతోపాటు ఆర్థిక అవకతవకలకు చౌదరి పాల్పడ్డారనీ విజయ సాయిరెడ్డి చేసిన విమర్శల వెనుక కొంతమందికి హెచ్చరిక కూడా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక ఆడిటర్‌గా విజయ సాయిరెడ్డి గతంలో తాను పనిచేసిన కంపెనీలపై ఇంతకాలం తర్వాత ఆరోపణలు చేయడం ద్వారా ఆయన వృత్తిపరమైన అనైతికతకు పాల్పడ్డారు. సుజనా చౌదరి తప్పుచేసి ఉంటే ఆ విషయం అప్పుడే సంబంధిత సంస్థల దృష్టికి తీసుకువెళ్లాల్సింది. అలా చేయకుండా మౌనంగా ఉన్నారంటే జరిగిన తప్పులో ఆయనకూ భాగం ఉన్నట్టే అవుతుంది. వృత్తిపరమైన అనైతికత విషయం అలా ఉంచితే, సుజనా చౌదరి అప్పట్లో తప్పులు చేశారని ఇప్పుడు చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి కూడా విజయసాయిరెడ్డి పరోక్షంగా హెచ్చరికలు పంపారా? అన్న సందేహాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు.


తాను జగన్మోహన్‌ రెడ్డి చేతిలో కీలుబొమ్మ కాదని పదిమందికి తెలియజేయడంతోపాటు తనను తక్కువగా అంచనా వేయవద్దని జగన్మోహన్‌ రెడ్డికి తెలియజెప్పడానికే పాత విషయాలను విజయ సాయిరెడ్డి ఎత్తి చూపుతున్నారని అభిప్రాయపడుతున్నారు. సుజనా చౌదరిపై ఆరోపణలు నిజమా? కాదా? అన్నది పక్కనపెడితే, వాటిని ఇప్పుడు వెల్లడిస్తున్న విజయ సాయిరెడ్డి భవిష్యత్తులో జగన్మోహన్‌ రెడ్డితో చెడితే ఆయన వ్యవహారాలను సైతం బయట పెట్టరని గ్యారంటీ ఏమి ఉందని గుంటూరుకు చెందిన నా మిత్రుడొకరు సందేహం వ్యక్తంచేశారు. ఇదే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తంచేస్తున్నారు కూడా! లోగుట్టు పెరుమాళ్లకు ఎరుక అన్నట్టుగా జగన్‌ గుట్టు అంతా విజయసాయిరెడ్డి గుప్పెట్లో ఉందన్నమాట.


కోర్టు తీర్పులూ బేఖాతరు...

ఈ విషయం అలా ఉంచితే, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఎటువంటి శషబిషలు, శంకలు లేకుండా తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. తనకంట్లో నలుసులా, పంటికింద రాయిలా మారిన హైకోర్టు ఆదేశాలను సైతం ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదు. ఉన్నత న్యాయస్థానం తీర్పులు ఎలా ఉన్నప్పటికీ తాను అనుకున్నదాన్ని ఏదో ఒక రూపంలో అమలు చేయడానికే ఆయన పట్టుదలతో ఉన్నారని అనేక ఉదంతాలు రుజువు చేస్తున్నాయి. ‘‘నేనొక రాజును. నా నిర్ణయాలను ఇతరులు అడ్డుకోవడం ఏమిటి?’’ అన్నది ఆయన అభిప్రాయంగా ఉంది. తన రాజ్యంలో తన రాజ్యాంగం ప్రకారమే అంతా జరిగిపోవాలని ఆయన బలంగా కోరుకుంటున్నారేమో తెలియదు. ఈ క్రమంలో హైకోర్టు తీర్పులు అడ్డువస్తున్నప్పటికీ వాటిని ఖాతరు చేయకుండా మరోమార్గంలో తాను ఏమి అనుకున్నానో అదే చేయడానికి ఆయన సంకల్పం తీసుకున్నారు. 


ఉదాహరణకు ప్రభుత్వ కార్యాలయాలకు, ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు వైసీపీ జెండాను పోలిన రంగులు వేయడంపై హైకోర్టు తప్పుపట్టడమే కాకుండా.. వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించింది. దీనిపై జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినా అక్కడ కూడా హైకోర్టు తీర్పునే సమర్థించారు. అయినా హైకోర్టు తీర్పు అమలుకాలేదు. దీంతో తీర్పు అమలు కోసం పిటిషనర్‌ మరోమారు హైకోర్టు తలుపు తట్టారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ లాక్‌డౌన్‌ ఎత్తివేయగానే మూడు వారాల్లోపు రంగులు మార్చాలనీ, అప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరపకూడదనీ స్పష్టంగా ఆదేశించింది. దీంతో హైకోర్టు తీర్పునకు తూట్లు పొడవడం ఎలా? అనే అంశంపై జగన్‌ అండ్‌ కో తమదైన ఆలోచనలకు పదునుపెట్టింది. ఫలితంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని రెండు రోజుల క్రితం రంగులకు సంబంధించిన మార్గదర్శకాలపై జీవో జారీచేశారు. ఆ జీవోలో కూడా వైసీపీ జెండా రంగులతోపాటు మట్టిరంగు కూడా వేయాలని నిర్దేశించారు. వైసీపీకి చెందిన తెలుపు, నీలం, ఆకుపచ్చ రంగులకు వేరే నిర్వచనాలను సదరు జీవోలో పొందుపరిచారు. కాకపోతే ఈ రంగులకు తోడు భవనాలపైన మట్టిరంగుతో పట్టీని కూడా వేస్తారు. ఈ చర్యను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని రేపు కోర్టులో ఎలా సమర్థించుకుంటారో వేచి చూడాలి. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడాన్ని న్యాయస్థానాలు ఆక్షేపిస్తాయని తెలిసి కూడా వందల కోట్ల రూపాయలు వ్యయం చేశారు. ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీ కూడా తమ పార్టీ పతాకాన్ని పోలిన రంగులను ప్రభుత్వ భవనాలకు వేయించింది. అదేమంటే ఆ రంగులు జాతీయ పతాకం రంగులని బుకాయించేది. అయితే, ఈ రంగులేవీ ఓటమి నుంచి ఆ పార్టీని కాపాడలేదు. ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం కూడా అదే మార్గాన్ని ఎంచుకుంది. హైకోర్టు ఆక్షేపిస్తుందన్న జంకు–గొంకు లేకుండా అధికారులు సైతం తానా అంటే తందానా అనడం ఆశ్చర్యంగా ఉంది. తాజాగా జారీ అయిన జీవోపై హైకోర్టు స్పందన ఎలా ఉంటుందో వేచిచూద్దాం! ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని 


తప్పనిసరి చేస్తూ జారీచేసిన జీవోను కూడా హైకోర్టు ఈ మధ్యనే కొట్టివేసింది. ఏ మాధ్యమంలో చదువుకోవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వదిలేయాలని ఈ సందర్భంగా హైకోర్టు సూచించింది. దీన్నే వెసులుబాటుగా మార్చుకున్న ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అఫిడవిట్‌లు సేకరించే పనికి శ్రీకారం చుట్టింది. మాతృభాషలో విద్యాబోధన జరగాలన్న నిబంధన రాజ్యాంగంలో ఉన్న విషయాన్ని కూడా జగన్‌ ప్రభుత్వం గుర్తించడానికి ఇష్టపడటం లేదు. ఎన్నికల కమిషనర్‌గా రమేశ్‌ కుమార్‌ను తొలగించి జస్టిస్‌ కనగరాజ్‌ను నియమించిన వ్యవహారంలో హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందో తెలియదు. తాము చేపట్టిన సంస్కరణలలో భాగంగా ఈ నిర్ణయాలన్నింటినీ ప్రభుత్వం తీసుకుంటున్నదని చెబుతున్నారు. కావొచ్చును గానీ, సంస్కరణలు సైతం అమలులో ఉన్న చట్టాలు, రాజ్యాంగానికి లోబడే ఉండాలన్న స్పృహ ప్రభుత్వాలకు ఉండాలి. న్యాయస్థానాల తీర్పులను శిరోధార్యంగా భావించడాన్నే ఇప్పటివరకు చూశాం.


బస్సు రూట్ల జాతీయీకరణ నిర్ణయంపై న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలతో నీలం సంజీవ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రైవేటు వైద్య కళాశాలలకు అనుమతి ఇచ్చిన వ్యవహారంలో హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డి సైతం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇది ఒకప్పటి మాట! ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇస్తున్న తీర్పులు, చేస్తున్న వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రోజూ రాజీనామా చేయాల్సి ఉంటుంది. అందుకు విరుద్థంగా హైకోర్టుతో ఢీకొనడానికే జగన్మోహన్‌ రెడ్డి సిద్థపడుతున్నారు. దాదాపు ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను 50కి పైగా సందర్భాలలో హైకోర్టు తప్పుబట్టింది. పంచాయతీ కార్యాలయాలకు రంగుల విషయమై తాజాగా జారీచేసిన జీవో ఎటువంటి వివాదానికి దారితీస్తుందో తెలియదు. ఉన్నత న్యాయస్థానం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటే అది ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకు మధ్య సంఘర్షణకు దారితీయవచ్చు. తన ఎజెండా అమలు విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఎంత దూరమైనా వెళ్తారని పలు ఉదంతాలు రుజువు చేస్తున్నాయి. విమర్శలు, సూచనలు అవి సహేతుకమైనవే అయినా.. ఆయన వాటిని ఖాతరు చేయరు.


కరోనా వైరస్‌ విషయమే తీసుకుందాం! మంత్రులు, శాసనసభ్యులు లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి భౌతిక దూరాన్ని పాటించకపోవడంపై వస్తున్న విమర్శలు ఆయన చెవికి ఎక్కడం లేదు. అధికార పార్టీ నాయకుల వైఖరి కారణంగా చిత్తూరు, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కరోనా వైరస్‌ విజృంభిస్తున్నప్పటికీ భౌతిక దూరాన్ని పాటించాలని జగన్మోహన్‌ రెడ్డి నోరుతెరిచి తన పార్టీ నాయకులకు ఒక్కమాట కూడా చెప్పకపోవడాన్ని ఎలా అర్థంచేసుకోవాలి? భౌతిక దూరం విషయానికి వస్తే, సమాజంలో కరోనా తెచ్చిన మార్పులను ఈ సందర్భంగా ప్రస్తావించాలి. సమాజంలో ఒకప్పుడు అంటరానితనం అనే దురాచారం ఉండేది.కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ ఉంది. అగ్రవర్ణాల వారు దళితులను అంటరానివారుగా చూసేవారు. కరోనా పుణ్యమా అని ఇప్పుడు సమాజంలో అందరూ అంటరానివారయ్యారు. మనుషులు ఒకరినొకరు ముట్టుకోవాలంటే హడలిపోతున్నారు. ఇక్కడ బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు, దళితులు అన్న తేడాలేదు. భార్యాభర్తలు సైతం ఒకరినొకరు ముట్టుకోవడానికి జంకే పరిస్థితి ఏర్పడింది.


ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నాయకులకు మాత్రం ఈ మార్పు మినహాయింపు! అందుకే వారు ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుని ఊరేగింపులు, ర్యాలీలు చేస్తున్నారు. అదే సమయంలో ఆ పార్టీలో వ్యక్తిపూజ కూడా పరాకాష్ఠకు చేరుకుంది. ఈ సంస్కృతిని ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వ్యాపింపజేసే ప్రయత్నాలకు ఆ పార్టీ నాయకులు తాజాగా శ్రీకారం చుట్టారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో జగన్మోహన్‌ రెడ్డి చిత్రపటాన్ని గోడమీద ఏర్పాటు చేసి గ్రామ సచివాలయ వాలంటీర్లను లైనులో నిలబెట్టి ఆ ఫొటో ముందు వంగివంగి దండం పెట్టించిన దృశ్యాలు చూశాక మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అన్న సందేహం కలగకుండా ఎందుకు ఉంటుంది! రాజులకాలంలో ఇలాంటి పరిస్థితులు ఉండేవని విన్నాం. ఇప్పుడు ఇంత కాలానికి మళ్లీ జగన్మోహన్‌ రెడ్డి రాజ్యంలో మనం వినడమేగాదు చూడని దృశ్యాలనూ ఆవిష్కరిస్తున్నారు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన కాళ్లకు మొక్కడాన్ని అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీతోపాటు ఇతరులు కూడా ఆక్షేపించారు. జయలలిత హయాంలో కూడా ఇటువంటి సంస్కృతిని చూశాం. ఒకప్పుడు జర్మనీలో హిట్లర్‌ ముందు కూడా ప్రజలు మోకరిల్లేవారు. కాలమే అన్నింటిని పరిష్కరిస్తుంది!

ఆర్కే

 

యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.