దేశాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ డైరెక్షన్‌లో పాలిస్తున్నారు

Published: Sat, 26 Mar 2022 23:49:28 ISTfb-iconwhatsapp-icontwitter-icon
 దేశాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ డైరెక్షన్‌లో పాలిస్తున్నారు రాజ్యాంగ రక్షణ సదస్సులో ప్రసంగిస్తున్న గజ్జెల కాంతం

- ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ గజ్జెల కాంతం

తిమ్మాపూర్‌, మార్చి 26: ఆర్‌ఎస్‌ఎస్‌ డైరెక్షన్‌లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా దేశాన్ని పాలిస్తున్నారని ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్‌, తెలంగాణ అబేద్కర్‌ యువజన సంఘాల రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు గజ్జెల కాంతం విమర్శించారు. శనివారం కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అలుగునూర్‌లో మానకొండూర్‌ నియోజకవర్గ స్థాయి రాజ్యాంగ రక్షణ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి గజ్జెల కాంతం ముఖ్య అతిఽథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యంగాన్ని అంబేద్కర్‌ ఒక్కరే రచించినట్లు అవాగాహన లేని వారు మాట్లాడుతున్నారని, 221మంది సభ్యులు కలిసి రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. 221 మంది సభ్యుల నుంచి 12 మందిని డ్రాఫ్టింగ్‌ కమిటీగా నియమించారని, ఆ కమిటీకి చైర్మన్‌గా డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ను నియమించారన్నారు. దీనిపై బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు అవగాహన లేదని విమర్శించారు. మనువాదులు, అగ్రవర్ణ కులాల వారు మహిళలకు అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీనికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ ప్రభుత్వానికి హిందువుల మీద ప్రేమ ఉంటే రాజ్యాంగాన్ని సరిగా అమలు అయ్యే విధంగా చూడాలని కోరారు. దళితుల హక్కులను కాపాడుకునేందుకు బీజేపీపై తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు. దేశంలో బీజేపీ వాళ్లు మాత్రమే హిందువులా.. అని గజ్జెల కాంతం ప్రశ్నించారు.  2014 నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లును నిర్వీర్యం చేస్తోందన్నారు. లక్షల కోట్లు ఉన్న బాడా బాబులకు 23 కేంద్ర ప్రభుత్వ సంస్తలను బీజేపీ ప్రభుత్వం అప్పజెప్పిందని, సింగరేణిని కూడా ప్రైవేట్‌ పరం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శించారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయమంటే కేంద్రం రాజకీయాలు చేస్తోందన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు మతం పేరుతో గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని, తెలంగాణలో అధి సాధ్యంకాదని అన్నారు. ముందు భారత రాజ్యాంగాన్ని  గౌరవించడం బీజేపీ నేర్చుకోవాలన్నారు. బీజేపీ భారత రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తోందని, దీన్ని అడ్డుకోవడానికి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో సదుస్సులు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్‌ యువజన సంఘాల జిల్లా అధ్యక్షుడు సముద్రాల అజయ్‌, రాష్ట్ర ప్లానింగ్‌ కమిటీ చైర్మన్‌ గజ్జెల ఆనందరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుద్దాల లక్ష్మణ్‌,  రాష్ట్ర కార్యదర్శులు మాతంగి శంకర్‌, లింగాల లక్ష్మణ్‌, గోష్కి శంకర్‌, మీసాల సాయిలు, అధికార ప్రతినిధి కొండ్ర సంపత్‌. జిల్లా మహిళ అధ్యక్షురాలు కొండ్ర స్వరూప, జిల్లా ప్రదాన కార్యదర్శి సముద్రాల లక్ష్మణ్‌, మామిడిపల్లి క్రిష్ణ, తిమ్మాపూర్‌ మండల అధ్యక్షుడు ఉప్పులేటి శంకర్‌ పాల్గొన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.