Home on Wheels: ఈ జంట భారతదేశంలో పర్యటించడానికి టెంపో ట్రావెలర్‌ను చిన్న ఇల్లుగా మార్చేశారు.

ABN , First Publish Date - 2022-09-05T21:48:06+05:30 IST

దేశం మొత్తం పర్యటించాలనే కోరిక మాత్రం ఇరవై సంవత్సరాల తరువాత, అంటే వాళ్ళ వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు పుట్టాకా తీరింది.

Home on Wheels: ఈ జంట భారతదేశంలో పర్యటించడానికి టెంపో ట్రావెలర్‌ను చిన్న ఇల్లుగా మార్చేశారు.

కొత్తగా పెళ్ళయిన జంటలు చాలా ప్రదేశాలను చూడాలని ఎన్నో కలలు కంటారు. డెహ్రాడూన్‌లోని కళాశాలలో కలుసుకున్న ఈ భారతీయ జంట దీపక్, రుచి పాండేలు కూడా పర్యటకులుగా మారిపోయి రకరకాల ప్రదేశాలు చూడాలని అందరిలానే ఎన్నో కలలు కన్నారు. అయితే ఈ జంట దేశం మొత్తం పర్యటించాలనే కోరిక మాత్రం ఇరవై సంవత్సరాల తరువాత, అంటే వాళ్ళ వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు పుట్టాకా తీరింది. 


ఈ ప్రయాణాన్ని చిన్న వాహనాలతో మొదలు పెట్టినా ఇద్దరు కొడుకులు, రెండు పెంపుడు జంతువులు వాళ్ళ సఫారీలో సరిపోక ఇబ్బంది పడ్డారు. దానికి తోడు కరోనా కారణంగా ప్రయాణం వాయిదా వేసుకోవలసి వచ్చింది. కొద్ది రోజులు బయటి భోజనం తినడం, హోటళ్ళలో బస చేయడం మానుకున్నారు. ఇక అప్పుడు నిర్ణయించుకున్నారు. ఈ ప్రయాణాన్ని కారవాన్లతో మొదలు పెట్టాలని. 


కారవాన్ అంటే ఏమిటి? 

క్యారవాన్ అంటే దానిలో సౌకర్యాలు చాలానే ఉంటాయి. మంచం, వంట సామాగ్రి ఒక చోట నుంచి మరోచోటికి మారాలన్నా తేలికగా వంట చేసుకుని విశ్రాంతి తీసుకునే వీలు ఉంటుంది. అందుకే దీపక్, రుచి పాండేలు కారవాన్ ను ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నారు. 


కారవాన్ వ్యాన్‌ లో ఎదురయ్యే సవాళ్లు..

వ్యాన్‌లో కూర్చోవడానికి విస్తీర్ణం, వంటగది, బాత్రూమ్, నలుగురిని పడుకోగలిగే రెండు భారీ పరుపులు, ఎయిర్ కండిషనింగ్, ఉన్నాయి. దీపక్ 150-లీటర్ వాటర్ ట్యాంక్, సోలార్ ఎనర్జీ ప్యానెళ్లను కూడా వ్యాన్ లో ఏర్పాటు చేసాడు. అయితే వ్యాన్ బుక్ చేసుకున్న తరువాత దానిని వాళ్ళ కుటుంబానికి తగ్గట్టు మార్చుకోవడానికి, వైట్ బోర్డ్ వెయికల్ కోసం RTO నుండి అనుమతి పొందడం, అధికారులను ఒప్పించడం కాస్త కష్టమైంది.


వెహికల్ అప్‌గ్రేడ్ చేయడం..  

పెద్ద కుటుంబానికి విశాలమైన క్యాంపర్‌వాన్‌గా మార్చి, ఫోర్స్ ట్రావెలర్ 3350ని ఈ జంట ఏప్రిల్ 2021లో కొనుగోలు చేసింది. వాళ్ళ కుటుంబానికి తగినట్టుగా అందులో ఏర్పాట్లు చేసుకున్నారు. దానికి అమెరికా నుంచి చాలా వస్తువులు, పరికరాలు తెప్పించారు. దీంతో ధర నాలుగు రెట్లు పెరిగింది.


కారవాన్‌ ప్రయోజనాలు..

కారవాన్‌లో ప్రయాణించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి, ఇందులో రోడ్డుపై ఉన్నప్పుడు సొంతంగా భోజనం తయారు చేసుకోవడం, కావలసిన సౌకర్యాలను ఏర్పాటు చేసుకుని ప్రయాణాన్ని ఆహ్లాదంగా మార్చుకోవడం అనేవి కారవాన్ వల్ల సులభమవుతాయి. ఇలా దూరప్రయాణాలను మీరూ ప్రయత్నించండి. 

Updated Date - 2022-09-05T21:48:06+05:30 IST