బట్టతలోడా.. అని ఎవరైనా వెక్కిరించారో ఇక అంతే సంగతులు..!

ABN , First Publish Date - 2022-05-14T21:18:12+05:30 IST

సాధారణంగా పురుషులకు త్వరగా బట్టతల వస్తుంది. మారుతున్న కాలం, ఆహారపు అలవాట్లతో చిన్న వయసులోనే జుట్టు ఊడిపోతుంది. అయితే తమ జుట్టు ఊడిపోయిందని చాలా మంది..

బట్టతలోడా.. అని ఎవరైనా వెక్కిరించారో ఇక అంతే సంగతులు..!

సాధారణంగా పురుషులకు త్వరగా బట్టతల వస్తుంది. మారుతున్న కాలం, ఆహారపు అలవాట్లతో చిన్న వయసులోనే జుట్టు ఊడిపోతుంది. అయితే తమ జుట్టు ఊడిపోయిందని చాలా మంది బాధపడుతుంటారు. ఎగతాళి చేస్తారేమో అని భయపడతారు. దానిని ఎలాగైనా కవర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ఇప్పటి నుంచి ఎవరికైనా బట్టతల ఉండి.. వారిని బట్టతల ఉన్నోడా అని పిలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు.. అంతేకాదు వారిపై లైంగిక వేధింపుల కింద కేసు పెట్టొచ్చు. అయితే ఇది మన దేశంలో కాదు.. ఇంగ్లండ్‌లో..


బ్రిటన్‌ వెస్ట్ యార్క్‌షైర్‌లోని బ్రిటిష్‌ బంగ్‌ కంపెనీలో పని చేసే టోనీ ఫిన్‌ అనే ఉద్యోగిని.. తన పైఅధికారి జేమీ కింగ్‌.. బట్టతల అంటూ ఎగతాళిగా మాట్లాడింది. దీంతో బాధపడిన టోనీ ఫిన్‌.. తాను లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానంటూ కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. స్త్రీల కంటే పురుషులు ఎక్కువగా జుట్టును కోల్పోతారు కాబట్టి.. ఎవరైనా ఈ పదాన్ని ఉపయోగించడం వివక్ష కిందికే వస్తుందని, ఇది లైంగిక వేధింపులకు సంబంధించినదని చెప్పింది. పురుషుల బట్టతల గురించి మాట్లాడడం.. స్త్రీలను లైంగికంగా వేధించడంతో సమానమని పేర్కొంది. ఫిన్‌ను బట్టతల అంటూ మాట్లాడటం అవమానకరమైన పద్ధతి అని కోర్టు అభిప్రాయపడింది. ఇది ఫిన్ గౌరవాన్ని దెబ్బతీసినట్లేనని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే బట్టతల అనే పదానికి.. సెక్స్ అనే పదానికి మధ్య సంబంధం ఉందని ధర్మాసనం పేర్కొంది.

Read more