‘కొవిన్‌’ యాప్‌ అడ్మినిస్ట్రేటర్లకు మాత్రమే

ABN , First Publish Date - 2021-03-02T07:18:29+05:30 IST

టీకా కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు ‘కొవిన్‌’ పోర్టల్‌ను వాడాలా? గూగుల్‌ ప్లే స్టోర్‌లోని ‘కొవిన్‌’ యాప్‌ను వాడాలా? అనే సందేహం చాలామందిలో తలెత్తుతోంది

‘కొవిన్‌’ యాప్‌ అడ్మినిస్ట్రేటర్లకు మాత్రమే

రిజిస్ట్రేషన్లకు ‘కొవిన్‌’ పోర్టల్‌ లేదా ఆరోగ్యసేతు యాప్‌: కేంద్రం


న్యూఢిల్లీ, మార్చి 1: టీకా కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు ‘కొవిన్‌’ పోర్టల్‌ను వాడాలా? గూగుల్‌ ప్లే స్టోర్‌లోని ‘కొవిన్‌’ యాప్‌ను వాడాలా? అనే సందేహం చాలామందిలో తలెత్తుతోంది. దీనిపై సోషల్‌ మీడియా వేదికగా పలువురు ప్రశ్నలు సం ధించగా.. ‘కొవిన్‌’ యాప్‌ కేవలం వ్యాక్సినేషన్‌ కార్యక్రమ అడ్మినిస్ట్రేటర్లకు సంబంధించిందని, దాన్ని వారు మాత్రమే వాడతారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. లబ్ధిదారులు రిజిస్ట్రేషన్‌ కోసం www.cowin.gov.in పోర్టల్‌ లేదా ఆరోగ్యసేతు యాప్‌ను వాడాలని సూచిస్తూ ట్వీట్‌ చేసింది. 

Updated Date - 2021-03-02T07:18:29+05:30 IST