గొర్రె పిల్లకు అమ్మ అయిన ఆవు

ABN , First Publish Date - 2022-05-22T05:51:40+05:30 IST

తన గర్భాన జన్మించకపోయినా.. తల్లి లేని గొర్రెపిల్లకు రోజూ పాలిచ్చి ఆకలి తీరుస్తూ అమ్మలా మమతానురాగాలను పంచుతోంది ఓ ఆవు.

గొర్రె పిల్లకు  అమ్మ అయిన ఆవు


తన గర్భాన జన్మించకపోయినా.. తల్లి లేని గొర్రెపిల్లకు రోజూ పాలిచ్చి ఆకలి తీరుస్తూ అమ్మలా మమతానురాగాలను పంచుతోంది ఓ ఆవు. బు డ్డారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొండ్రెడ్డి రామచంద్రారెడ్డి గతంలో గొర్రెలను కాసుకుంటూ జీవనం సాగించేవాడు. కొన్నేళ్ల క్రితం ఇబ్బందులతో గొర్రెలను అమ్ముకున్నాడు.  ఇటీవల మళ్లీ రామచంద్రారెడ్డి అప్పుడే పుట్టిన గొర్రెపిల్లను కొని ఇంటికి తెచ్చుకున్నాడు. తల్లిలేని గొర్రెపిల్ల ఆకలి తీర్చేందుకు ఆవుపాలు తీసి సీసాద్వారా పట్టించేవాడు. ఇదే సమయంలో తన ఇంటివద్ద ఉన్న ఆవుకు గొర్రెపిల్ల మచ్చికైంది. అప్పటి నుంచి ఆ గొర్రె పిల్లకు ఆవు ఉదయం, సాయంత్రం పాలు ఇస్తోంది. కన్నబంధం వేరైనా నేరుగా పొదుగు ద్వారా పాలు తాగించి సొంతబిడ్డలా ఆకలి తీరుస్తోంది. గోమాత ప్రేమను చూస్తున్న గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

- పీసీపల్లి


Updated Date - 2022-05-22T05:51:40+05:30 IST