సీపీఎస్‌ రద్దు హామీని నిలబెట్టుకోవాలి

ABN , First Publish Date - 2021-08-03T05:42:14+05:30 IST

ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరమణరెడ్డి డిమాండ్‌ చేశారు.

సీపీఎస్‌ రద్దు హామీని నిలబెట్టుకోవాలి
ఆలూరులో నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు

  1. ఆలూరు, హులేబీడులో ఉపాధ్యాయుల నిరసన


ఆలూరు, ఆగస్టు 2: ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరమణరెడ్డి డిమాండ్‌ చేశారు. ఆలూరు ప్రభుత్వ, బాలుర ఉన్నత పాఠశాల-1, హులేబీడు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు సోమవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వారానికే సీపీఎస్‌ రద్దు చేస్తానని ప్రకటించి రెండేళ్లు గడచినా నెరవేర్చలేదని అన్నారు. ఇందుకు 7వ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామని, 8వ తేదీన క్విట్‌ సీపీఎస్‌ అంటూ శాససభ్యులకు వినతి పత్రాలు ఇవ్వడం, 15న సామాజిక మాధ్యమాల్లో సీపీఎస్‌ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయడం, 16 నుంచి 21వ తేదీ వరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసనలు, సెప్టెంబరు 1న జిల్లా కేంద్రంలో పెన్షన్‌ విద్రోహ దినం-నయవంచన సభ నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఎం మస్తాన్‌రావు, ఉపాధ్యాయులు రమణయ్య, నాగరాజు, యూసుఫ్‌, సిద్దలింగమూర్తి, సుభాని, వెంకటేశ్వర్లు, మహబూబ్‌ ఖాన్‌, కవిరాజు, సూర్యనారాయణ, మహాలక్ష్మి, జమునాబాయి పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-03T05:42:14+05:30 IST