పంట పండింది

ABN , First Publish Date - 2022-09-26T04:49:41+05:30 IST

రైతు పంట పండింది. వేరుశనగ పంట విరగ్గాసింది.

పంట పండింది
వేరుశనగ కాయలు చూపుతున్న రైతు చంద్రశేఖర్‌రెడ్డి

విరగ్గాసిన వేరుశనగ కాయలు

చెట్టుకు 150 నుంచి 300 కాయలు

ఎకరాకు 60 బస్తాలు


ములకలచెరువు, సెప్టెంబరు 25: రైతు పంట పండింది. వేరుశనగ పంట విరగ్గాసింది. ఒక్కో చెట్టుకు 150 నుంచి 300 కాయలు కాశాయి. దీంతో అన్నదాత ఆనందానికి అవధులు లేవు. ములకలచెరువు మండలం కాలువపల్లె పంచాయతీ బుద్దలవారిపల్లెకు చెందిన రైతు పూల చంద్రశేఖర్‌రెడ్డి వ్యవసాయ బోరు కింద ఎకరా పొలంలో వేరుశనగ పంట సాగు చేశాడు. అనంతపురం నుంచి తెచ్చిన టీసీజీఎస్‌ 1964 రకం విత్తనాలు విత్తాడు. ఎకరా సాగుకు రూ.20 వేలు ఖర్చయ్యింది. రెండున్నర నెలల తర్వాత పంట కోత కొచ్చింది. ఈ క్రమంలో ఆదివారం నుంచి పంట నూర్పిడి (కోత) చేయిస్తున్నాడు. ఒక్కో చెట్టుకు 150 నుంచి 300 కాయల వరకు ఉండడంతో రైతు ఆశ్యర్యపోయాడు. ఎకరాకు 60 బస్తాల కాయలు అవుతాయని చెబుతున్నాడు. ఇటీవలి కాలంలో ఎక్కడా ఇంత పెద్ద స్ధాయిలో వేరుశనగ కాయలు కాయలేదని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. 

Updated Date - 2022-09-26T04:49:41+05:30 IST