నియంత జగనకు రోజులు దగ్గరపడ్డాయి

ABN , First Publish Date - 2021-03-02T07:04:45+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ నియంతలా పాలిస్తున్నాడని ఈ నియంత ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని హిందూపురం టీడీపీ పార్లమెంట్‌ అధ్యక్షుడు బీకే పార్థసారథి ద్వజమెత్తారు.

నియంత జగనకు రోజులు దగ్గరపడ్డాయి
పెనుకొండలో బీకే పార్థసారథిని అరె్‌స్టచేసి స్టేషనకు తరలిస్తున్న పోలీసులు

  • -దౌర్జన్యాలు చేయడమే సీఎం లక్ష్యం : మాజీ ఎమ్మెల్యే బీకే ఆగ్రహం
  • -టీడీపీ శ్రేణుల నిరసన,ధర్నా

పెనుకొండ, మార్చి 1: ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ నియంతలా పాలిస్తున్నాడని ఈ నియంత ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని హిందూపురం టీడీపీ పార్లమెంట్‌ అధ్యక్షుడు బీకే పార్థసారథి ద్వజమెత్తారు. సోమవారం చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని రేణి గుంట విమానాశ్రయంలో నిర్బందించడాన్ని నిరసిస్తూ స్థానిక ఎన్టీఆర్‌ సర్కిల్‌లో బీకే పార్థసారథి, మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని అక్రమ అరె్‌స్టలను వెంటనే ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పాలనలో రాష్ట్రం రాక్షసరాజ్యంగా తయారైందన్నారు. టీడీపీ నాయకులను టార్గెట్‌ చేస్తూ చంద్రబాబును మొదలుకుని గ్రామస్థాయి నాయకులను సైతం వేదింపులకు గురిచేయడం, దౌర్జన్యాలకు గురిచేయడం, అరె్‌స్టచేయడం, చివరకు హత్యలు చేయడానికి కూడా వెనుకంజ వేయడం లేదన్నారు. అభ్యర్థులను నామినేషన వేయకుండా అడ్డుకోవడం, వారిపై దాడులు చేయడం, అభ్యర్థులను కిడ్నాప్‌ చేయడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు నారాయణస్వామి, చిన్నప్పయ్య,  మాజీ ఎంపీపీలు కేశవయ్య, శ్రీనివాసులు, బొక్సంపల్లి రామక్రిష్ణ, కన్వీనర్లు శ్రీరాములు, సోమశేఖర్‌, హుజురుల్లాఖాన, త్రివేంద్రనాయుడు, గుట్టూరు సూరీ, మునిమడుగు వెంకటరాముడు, సింగిల్‌విండో మాజీ అధ్యక్షులు లక్ష్మీనారాయణరెడ్డి, దోని లక్ష్మీనారాయణ, కన్నాస్వామి, సుబ్రమణ్యం, గోరంట్ల నాయకులు గిరిధర్‌గౌడ్‌, నియోజకవర్గానికి చెందిన అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాస్తారోకో కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో ఎస్‌ఐ వెంకటేశ్వర్లు వారి సిబ్బంది సంఘటనా స్థలాన్ని చేరుకుని నాయకులను అరె్‌స్టచేసి పోలీ్‌సస్టేషనకు తరలించారు. నాయకులను అరె్‌స్టచేయడంపై పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 

హిందూపురం టౌన: ఆంధ్రప్రదేశలో అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగంకు అనుగుణంగా వైసీపీ పాలన సాగలేదని రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందంటూ టీడీపీ నాయకులు మండిపడ్డారు. సోమవారం ప్రతిపక్షనేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులు నిర్బంధించడంపై హిందూపురంలో ఎమ్మెల్యే నివాసం వద్ద టీడీపీ నాయకులు నిరసన తెలిపారు. ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన తెలుపడానికి తెలుగుదేశం పార్టీ అధినేత వెళ్తుంటే అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు అత్యధిక కాలంగా ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనేతగా రాష్ట్రానికి సేవలందించారు. అలాంటి వ్యక్తినే ఇలా దారుణంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో రాక్షసపాలనకు అద్దం పడుతోందని విమర్శించారు. ఈ రాష్ట్రంలో కేవలం వైసీపీ నాయకులే పర్యటించాలా, వారికి కోవిడ్‌ నిబంధనలు వర్థించవా అంటూ ప్రశ్నించారు. పోలీసుల తీరు రాష్ట్రంలో దారుణంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ, అహుడా మాజీ చైర్మన అంబికా లక్ష్మీనారాయణ, మనోహర్‌ నాయుడు, కొల్లకుంట అంజి, రొద్దం నరసింహులు, రమేష్‌, అమర్‌నాథ్‌, విజయ్‌, తదితరులు పాల్గొన్నారు. 




Updated Date - 2021-03-02T07:04:45+05:30 IST