మూడు రోజులే గడువు

ABN , First Publish Date - 2022-08-13T06:10:23+05:30 IST

పీఎం కిసాన యోజన లబ్ధిదారులు ఈకేవైసీ చేయించుకునేందుకు ఇక మూడు రోజులే గడువు ఉంది.

మూడు రోజులే గడువు

జిల్లాలో 3,31,430 మంది పీఎం కిసాన యోజన లబ్ధిదారులు 

ఇప్పటి దాకా 1,99,537 మందికి ఈకేవైసీ

మిగతా 1,31,893 పెండింగ్‌లోనే.. 

అవగాహన కల్పించని యంత్రాంగం 

అనంతపురం అర్బన, ఆగస్టు 12 : పీఎం కిసాన యోజన లబ్ధిదారులు ఈకేవైసీ చేయించుకునేందుకు ఇక మూడు రోజులే గడువు ఉంది. కేంద్ర  ప్రభుత్వం అమలు చేస్తున్న పలుసంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకు ఈకేవైసీ (ఎలక్ర్టానిక్‌ నో యువర్‌ కస్టమర్‌) తప్పని సరి చేశారు.  కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన ద్వారా ప్రతి ఏడాది రూ.6వేలు చొప్పున మూడు దఫాలుగా డబ్బులు జమ చేస్తోంది. గత ఏడాది లబ్ధిపొందిన వారు కూడా ఈఏడాది  మళ్లీ ఈకేవైసీ తప్పని చేయించుకోవాలన్న షరతు పెట్టారు. ఈ విషయాన్ని క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కల్పించడంలో పలు మండలాల్లోని  వ్యవసాయ అధికారులు, సిబ్బంది శ్రద్ధ చూపలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జూన రెండో వారంలో ఈ ప్రక్రియను మొదలు పెట్టారు. తొలుత గతనెలాఖరు దాకా గడువు విధించారు. అయి నా అనేక మంది ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉండటంతో ఈనెల 15దాకా గడువు  పొడిగించారు. 


ఇప్పటి దాకా 199537 మందికి ఈకేవైసీ

జిల్లాలో 3,31,430 మంది పీఎం కిసాన లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో ఇప్పటి దాకా 199537 మంది ఈకేవైసీ పూర్తి చేశారు. ఇంకా 1,31,893  మంది పెండింగ్‌లో ఉన్నారు. క్షేత్ర స్థాయిలో రైతులకు పీఎం కిసాన  డబ్బుల కోసం ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలన్న సమాచారాన్ని అందించకపోవడంతోనే ఇంకా అనేక మంది రైతులు పెండింగ్‌లో ఉన్నారన్న విమర్శలున్నాయి. 


ఈకేవైసీ చేసుకునేలా విధానం ఇలా...

ఈ కేవైసీ, కేవైసీ రెండు వేర్వేరు విధానాలు. ఓటీపీ ఆధారంగా ఈకేవైసీ చేయించుకోవచ్చు. ఆధార్‌ రిజిస్టరైన మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీతో ఈకేవైసీని పూర్తి చేస్తారు. గతంలో పీఎం కిసానకు కేవైసీ చేయించిన లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల మేరకు మళ్లీ ఈ కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆర్‌బీకే ఆదేశాల మేరకు మనీ ల్యాండరింగ్‌, ఫేక్‌ అకౌంట్లను అరికట్టేందుకు ఈకేవైసీని అమలు చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలోని అన్ని మండలాల్లో ఉన్న కస్టమర్‌ సెంటర్లల్లో (సీఎస్‌సీ) రైతుల ఈకేవైసీ చేస్తున్నారు. ఆనలైన కేంద్రాలు, మీసేవ కేంద్రాల్లోను ఈ ప్రక్రియ చేసుకోవచ్చు. స్మార్ట్‌ ఫోన ద్వారా కూడా ఈకేవైసీని పూర్తి చేసుకునే వెసులుబాటు కల్పించారు. ముందుగా ఠీఠీఠీ.ఞఝజుజీట్చుఽ.జౌఠి.జీుఽ వెబ్‌ సైట్‌లోకి వెళ్లిఆధార్‌ నెంబర్‌ నమోదు చేసుకోవాలి. దీంతో ఆధార్‌ కార్డుకు లింక్‌ అయిన మొబైల్‌కు ఓటీపీ  నెంబర్‌వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేసి సబ్మిట్‌ చేస్తే ఈకేవైసీ అప్‌డేట్‌ అవుతుంది. 


రైతులు తప్పని సరిగా చేసుకోవాలి

కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు పీఎం కిసాన లబ్ధిదారులు తప్పని సరిగా ఈకేవైసీ చేయించుకోవాలి. అలా చేస్తేనే ప్రభుత్వం అందించే సొమ్ము లబ్ధి జమ అవుతుంది. నిర్దేశించిన గడువులోగా రైతులు ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. రైతులకు అవగాహన కల్పించి, పీఎం కిసాన ఈకేవైసీని పూర్తి చేయించాలని అన్ని మండలాల అధికారులను ఇదివరకే ఆదేశించాం. పెండింగ్‌లోని రైతులతో కూడా ఈకేవైసీ చేయించేలా చర్యలు తీసుకుంటాం. 

- చంద్రానాయక్‌, జిల్లా వ్యవసాయ అధికారి 


Updated Date - 2022-08-13T06:10:23+05:30 IST