సీసీఐపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-05-20T05:15:26+05:30 IST

సీసీఐపై కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీసీఐ సాధన కమిటీ కో కన్వీనర్‌ నారాయణ ప్రశ్నించారు.

సీసీఐపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
చాందా(టి) బ్రిడ్జి వద్ద రాస్తారోకో చేస్తున్న భూనిర్వాసితులు

ఆదిలాబాద్‌టౌన్‌, మే19: సీసీఐపై కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీసీఐ సాధన కమిటీ కో కన్వీనర్‌ నారాయణ ప్రశ్నించారు. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భూ నిర్వాసితులు గురువారం చాందా(టి) బ్రిడ్జిపై ఎడ్లబండ్లతో రాస్తారోకో చేపట్టారు. కేంద్రం, బీజేపీ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీసీఐ భూ నిర్వాసితులకు న్యాయం చేస్తామని ఎంపీ సోయం బాపురావ్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు హామీ ఇచ్చి ఇప్పుడు ఎటు పోయారని మండిపడ్డారు. ప్రధానమంత్రిపై ఒత్తిడి పెంచి ఫ్యాక్టరీ పునః ప్రారంభానికి కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసు లు ధర్నాను విరమించాలని కోరగా వారికి వినతిపత్రం అందించి రాస్తారోకోను విరమించారు. కార్యక్రమంలో సీసీఐ సాధన కమిటీ, భూ నిర్వాసితుల సంఘం నాయకులు మల్లేష్‌, అరవింద్‌, ఈశ్వర్‌, విఠల్‌, బండిదత్తాత్రి, జగన్‌, రాహుల్‌, కిరణ్‌, రాఘవులు తదితరులు పాల్గొన్నారు.

కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా

సీసీఐని రాష్ట్ర ప్రభుత్వం తెరిపించేందుకు కృషిచేస్తుంటే కేంద్రం మాత్రం యంత్రాలకు వేలం పాట ప్రక్రియ చేపట్టడం సరికాదని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్‌ అన్నారు. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ అనుబంధ సంఘం సీసీఐ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో గురువారం సీసీఐ గేటు ఎదుట ధర్నా నిర్వహించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న కార్మికులకు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీసీఐ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు రాజన్న, స్వామి, ఆర్‌కే గోష్‌, ప్రకాష్‌, రవి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-20T05:15:26+05:30 IST