పేదల ఇళ్లను కూల్చివేస్తామనడం బాధాకరం

ABN , First Publish Date - 2021-03-06T05:25:50+05:30 IST

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అప్పటి జిల్లా ఇన్‌చార్జి మంత్రి బసవరాజు సారయ్య చేతుల మీదుగా మావల పరిధిలోని సర్వే నెంబర్‌ 170లో మంజూరు చేసిన స్థలాల్లో పేదలు నిర్మించుకుంటున్న ఇళ్లను కూల్చి వేస్తామనడం సమంజసం కాదని డీసీసీ జిల్లా అధ్యక్షుడు సాజిద్‌ఖాన్‌ అన్నారు.

పేదల ఇళ్లను కూల్చివేస్తామనడం బాధాకరం
అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేస్తున్న సాజిద్‌ఖాన్‌, బాధితులు

ఆదిలాబాద్‌టౌన్‌, మార్చి 5: కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అప్పటి జిల్లా ఇన్‌చార్జి మంత్రి బసవరాజు సారయ్య చేతుల మీదుగా మావల పరిధిలోని సర్వే నెంబర్‌ 170లో మంజూరు చేసిన స్థలాల్లో పేదలు నిర్మించుకుంటున్న ఇళ్లను కూల్చి వేస్తామనడం సమంజసం కాదని డీసీసీ జిల్లా అధ్యక్షుడు సాజిద్‌ఖాన్‌ అన్నారు. గురువారం 170 కాలనీలో కట్టుకుంటున్న ఇల్లును కూల్చి వేస్తామని చెప్పిన ఆర్డీవో వాహనానికి అడ్డం పడిన బాధితుల కథనం ‘ఆంధ్రజ్యోతి’లో ‘ఇంటిని కూల్చొద్దు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన సాజిద్‌ఖాన్‌ శుక్రవారం అదనపు కలెక్టర్‌ సంధ్యారాణిని కలిసి వినతి పత్రం అందించారు. ఇళ్లు లేని పేద వారికి ఇండ్లు మంజూరు చేయాల్సిన అధికారులు అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పని చేస్తున్నారని సాజిద్‌కాన్‌ ఆరోపించారు. ఇప్పటికైనా నిరుపేదలు కట్టుకుంటున్న గూడును కూల్చి వేసే పద్ధతిని మానుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో బాధితులకు అండగా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.

Updated Date - 2021-03-06T05:25:50+05:30 IST