దళితుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2022-06-25T06:44:21+05:30 IST

దేశంలో ఎక్కడా లేనివిధంగా దళితుల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని మునీరాబాద్‌లో దళితబంధు పథకం లబ్ధిదారులకు మంజూరైన వాహనాలను శుక్రవారం పంపిణీ చేశారు.

దళితుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
మునీరాబాద్‌లో దళితులకు వాహనాలను పంపిణీ చేస్తున్న ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత

ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి

బొమ్మలరామారం, జూన్‌ 24 : దేశంలో ఎక్కడా లేనివిధంగా దళితుల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని మునీరాబాద్‌లో దళితబంధు పథకం లబ్ధిదారులకు మంజూరైన వాహనాలను శుక్రవారం పంపిణీ చేశారు. దళితబంధు నిధులతో కొనుగోలు చేసిన యూనిట్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని, ఆర్థికంగా ఎదగాలన్నారు. గ్రామంలో 15 కుటుంబాలుండగా 11 మందికి వాహనాలను అందజేశా రు. మిగతా వారికి కూడా త్వరలో అందజేస్తామన్నారు. రానున్న రోజుల్లో రెండు వేల కుటుంబాలకు ఈ పథకం అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో కృ ష్ణారెడ్డి, ఎంపీపీ చిమ్ముల సుధీర్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శ్యాంసుందర్‌, వైస్‌ఎంపీపీ గొడుగు శోభాచంద్రమౌ ళి,పీఏసీఎస్‌ చైర్మన్‌ బాల్‌నర్సయ్య, ఎంపీడీవో సరిత, సర్పంచ్‌ హారిక, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పోలగౌని వెంకటేశ్‌గౌడ్‌, నాయకులు తొంట సత్యనారాయణ, మన్నె శ్రీధర్‌, పొషంరెడ్డి, సర్పంచ్‌ నవీన్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-25T06:44:21+05:30 IST