ఆలయాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2022-05-26T07:13:29+05:30 IST

ఆలయ అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని న్యాయ, పర్యావరణ, అటవీ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

ఆలయాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
ప్రారంభిస్తున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

సారంగాపూర్‌, మే 25 : ఆలయ అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని న్యాయ, పర్యావరణ, అటవీ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని బీరవెల్లిలో మల్లన్నస్వామి విగ్రహ ప్రతిష్ఠాపనకు హాజరై ఆలయంలో ప్రత్యేకపూజలు చేశారు. ఆలయంలో వేదపండితులు హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలోని దేవా లయాలకు సీఎం కేసీఆర్‌ ఎనలేని కృషి చేస్తున్నారని, రాష్ట్రంలో దేవాల యాలన్నీ అభివృద్ధి చెందాయన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃనిర్మాణం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ప్రత్యేక అభివృద్ధి నిధులతో ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలను, కామన్‌గుడ్‌ఫండ్‌ నిధులతో దేవాలయాల నిర్మాణం పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఆలయనిర్మాణపనులకు నిధులు మంజూ రు చేయడంతోనే ఆలయ నిర్మాణాలు జరిగాయన్నారు. గతంలో లేని విధం గా దేవాలయాలకు నిధులు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందన్నారు. ఆడెల్లి మహాపోచమ్మ దేవాలయం అభివృద్ధిపనులకోసం రూ.10 కోట్లు మం జూరయ్యాయని, కృష్ణశిలతో నిర్మాణం జరుగుతుందన్నారు. అలాగే కాల్వ నరసింహస్వామి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించడం జరిగిందన్నారు. దీంతో పాటు మల్లన  ఆలయ అభివృద్ధి పనుల కోసం నిధులను మంజూరు చేసాయిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అట్ల మహిపాల్‌ రెడ్డి, సర్పంచ్‌ రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీ లయ, పార్టీ మండలాధ్యక్షుడు మాఽ దవ్‌రావు పాల్గొన్నారు.

సోన్‌, మే 25 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే ఆలయాలకు మహర్దశ వచ్చిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని న్యూ వెల్మల్‌ గ్రామంలో రూ. 16 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన లక్ష్మివేంకటేశ్వరస్వామి ఆలయ విగ్రహప్రతిష్ఠ కార్య క్రమానికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హాజరై పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల మాట్లాడుతూ... వేంకటేశ్వరస్వామి ఆలయానికి రూ. 66 లక్షల నిధులు మంజూరు చేశామని, ఇప్పటి వరకు రూ.36 లక్షలతో పనులు పూర్తి చేశామని తెలిపారు. మరో 30 లక్షలతో ప్రహరీగోడ, ఇతర పనులు అభివృద్ధి చేస్తామని అన్నారు. నిర్మల్‌ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 600ల పైగా దేవాలయాలను అభివృద్ధి చేసుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌ పర్సన్‌ విజయలక్ష్మి, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలచారి, సర్పంచ్‌ అంకం గంగమణి, ఎంపీటీసీ నాగయ్య, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ చైర్మన్‌ ధర్మాజీగారి రాజేందర్‌, జడ్పీటీసీ జీవన్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ స్వామి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-26T07:13:29+05:30 IST