నియంతపాలనకు చరమగీతం పాడాలి

ABN , First Publish Date - 2022-01-18T06:27:11+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాగిస్తున్న నియంత పాలనకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు చరమగీతం పా డటం ఖాయమని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు.

నియంతపాలనకు చరమగీతం పాడాలి
చింతపల్లిలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

 ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి

మిర్యాలగూడ/చింతపల్లి/ కొండమల్లేపల్లి, జనవరి 17: ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాగిస్తున్న నియంత పాలనకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు చరమగీతం పా డటం ఖాయమని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాల్లో నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో వారు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో రైతుబంధు సంబరాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. నాలుగు విడతల రుణమాఫీ పేరుతో రైతులను ఇబ్బంది పెడుతోందని అన్నారు. రైతులు వరి సాగు చేయవద్దని చెప్పడం తుగ్లక్‌ చర్యగా అభివర్ణించారు. ఈ విషయమై అసెంబ్లీలో ఒక్క టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కూడా ప్రశ్నించకపోవడం విడ్డూరమన్నారు. ఇంతటి మొదనష్టపు, అసమర్థ పాలన దేశంలో ఎక్కడా లేదని విమర్శించారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది, తెలంగాణ రాష్ర్టాన్ని ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీయేనని అన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు.  దేశవాప్తంగా ఏకకాలంలో 72వేల కోట్ల రైతు రుణ మాఫీ చేసింది కాంగ్రెస్‌ మాత్రమేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, సర్పంచల దాకా దోచుకో, దాచుకో పథకం అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నియోజకవర్గంలోని ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు రూ.4వేల కోట్లు ఖర్చు చేస్తే పూర్తవుతుందని అన్నారు. కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్ష కోట్లు కేటాయించి కమీషన్ల కింద రూ.30 వేల కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. డిజిటల్‌ సభ్యత్వ నమోదులో బూతకు వంద మంది ఓటర్లకు తగ్గకుండా సభ్యత్వాలు చేయించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని వారు పేర్కొన్నారు. కలిసికట్టుగా పనిచేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే నేనావత బాలునాయక్‌ మా ట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు కష్టపడి ఈ నె ల 26వ తేదీలోపు పూర్తిగా ఆనలైన సభ్యత్వ కార్యక్రమాన్ని చేపట్టాలని తెలిపా రు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌, జిల్లా సభ్యత్వ నమో దు కో-ఆర్డినేటర్‌ ఉపేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు మా ధవి, మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ బత్తుల లక్ష్మారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూ రి బాలు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్‌, తమ్మడబోయిన అర్జున, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు చిరుమర్రి కృష్ణయ్య, మైబెల్లి, పగిడి రామలింగయ్య, వేణుధర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, వేమనరెడ్డి, ముచ్చర్ల యాదగిరి, జాహంగీర్‌, హరినాయక్‌, వెంకటనర్సింహరెడ్డి, శ్రీనివా్‌సయాదవ్‌, జితేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌, నాగభూషణం, ఎంపీపీలు, పార్టీ మండల అధ్యక్షులు, యూత కాంగ్రెస్‌ నాయకులు, బూత కన్వీనర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-18T06:27:11+05:30 IST