త్రివిధ దళాలను ఏకతాటి పైకి తీసుకువచ్చిన Shoorveer

Published: Mon, 27 Jun 2022 19:22:59 ISTfb-iconwhatsapp-icontwitter-icon
త్రివిధ దళాలను ఏకతాటి పైకి తీసుకువచ్చిన Shoorveer

మిలటరీ నేపథ్యంలో చాలా కథలు వచ్చాయి. బాక్సాఫీస్ హిట్‌లుగా నిలిచాయి. తాజాగా మిలటరీని బ్యాక్ డ్రాప్‌గా చేసుకుని ‘శూర్‌వీర్’ (Shoorveer)టైటిల్‌తో ఓ వెబ్ సిరీస్ నిర్మితమయింది. రెజీనా కసాండ్రా(Regina Cassandra), మర్కంద్ దేశ్‌పాండే(Makarand Deshpande) తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘డిస్నీ+హాట్‌స్టార్’ లో జులై 15నుంచి ఈ షో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ షోకు సంబంధించిన ట్రైలర్ విడుదలయింది. అభిమానులను విపరీతంగా అలరిస్తుంది.


ఎలైట్ టాస్క్‌ఫోర్స్ అనే మిలటరీ బృంద ప్రయాణాన్ని ట్రైలర్‌లో చూపించారు. జాతీయ బెదిరింపులు ఎదురైన సమయంలో మొదటగా ఈ బృందం ఏ విధంగా స్పందిస్తుంది.. దేశాన్ని ఏ విధంగా రక్షించింది అనేది వెబ్ సిరీస్‌లో చూపించబోతున్నట్టుగా ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. ‘శూర్‌వీర్’ ను జగ్గర్ నాట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. సమర్ ఖాన్ క్రియేట్ చేశారు. కనిష్క్ వర్మ దర్శకత్వం వహించారు. అర్మాన్ రల్హాన్, ఆదిల్ ఖాన్, అభిషేక్ సాహా, అంజలి బరోట్, కుల్దీప్ సరీన్, ఆరిఫ్ జకారియా, ఫైసల్ రషీద్, సాహిల్ మెహతా తదితరులు నటించారు. ఈ షో గురించి క్రియేటర్ సమర్ ఖాన్ మీడియాతో మాట్లాడారు. ‘‘యాక్షన్, ఎమోషన్స్‌తో కూడిన ఇంటెన్స్ డ్రామాను చూపించాలనే ఆలోచనతో ‘శూర్‌వీర్’ ను రూపొందించాం. ఈ  షోలోని పాత్రలు బలమైన భావోద్వేగాలు కలిగి ఉంటాయి. త్రివిధ దళాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి చూపించాలనేది నా కల. ‘శూర్‌వీర్’ తో డిస్నీ+హాట్‌స్టార్‌ మాకు ఈ అవకాశాన్ని కల్పించింది. ఈ షోను చూసి ప్రేక్షకులు ఏం చెబుతారో అని నేను ఎదురుచూస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కోసం ఇంత బలమైన తారాగణం లభించడం నా అదృష్టం’’ అని సమర్ ఖాన్ చెప్పారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...