జిల్లా పోలీసులకు విజయాలు కలగాలి

Oct 14 2021 @ 00:24AM
ఆయుధ పూజలో పాల్గొన్న ఏఎస్పీ, డీఎస్పీ, సిబ్బంది

- ఏఎస్పీ షాకీర్‌హుస్సేన్‌ 

- సాయుధ దళ కార్యాలయంలో ఆయుధ పూజ

వనపర్తి క్రైం, అక్టోబరు 13: నిరంతరం ప్రజాసేవలో జీవించే జిల్లా పోలీసులకు దసరా పండుగ సందర్భంగా దుర్గాదేవి అనుగ్ర హంతో విజయం వరించాలని ఏఎస్పీ షాకీర్‌హుస్సేన్‌, డీఎస్పీ కిర ణ్‌ కుమార్‌ ఆకాంక్షించారు. నవరాత్రి వేడుకల్లో భాగంగా చివరి రోజు అయిన బుధవారం జిల్లా కేంద్రంలోని సాయుధ దళ పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ, డీఎస్పీలు, పోలీసుల ఆ యుధాలకు, వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సం దర్భంగా అదనపు ఎస్పీ, డీఎస్పీలు మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పండుగను జరుపు కుంటారని అన్నారు. సమాజంలో చెడును పారద్రోలేందుకు పో లీసు విభాగం కృషి చేస్తోందన్నారు.  అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పు డు పోలీసు వారిపై ఉండాలని కోరారు. అదేవిధంగా ఎస్పీ జిల్లా పోలీసు సిబ్బందికి, జిల్లా ప్రజలకు దసరా పండుగ  శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సాయధదళ ఇన్‌స్పెక్టర్లు, వెంకట్‌, జగన్‌, వనపర్తి, కొత్తకోట, ఆత్మకూరు సీఐలు ప్రవీణ్‌ కు మార్‌, మల్లికా ర్జున్‌,  రత్నం, సీసీఎస్‌ శ్రీనివాసచారి, పట్టణ ఎస్సై మధుసూదన్‌, వనపర్తి రూ రల్‌ ఎస్సై షేక్‌ షఫీ, రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్లు వినోద్‌, మహేష్‌, ఎస్పీ పీఆర్‌వో రాజగౌడ్‌,   పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Follow Us on: