బ్యాంకు లింకేజీలో జిల్లాకు ప్రథమ స్థానం

ABN , First Publish Date - 2022-05-21T03:32:49+05:30 IST

బ్యాంకు లింకేజీలో జిల్లా ప్రథమ స్థానంలో రావడం అభినందనీయమని కలెక్టర్‌ భారతి హోళికేరీ పేర్కొన్నారు. ఈనెల 18న హైద్రాబాద్‌లో జరిగిన బ్యాంకు లింకేజీ లాంచింగ్‌లో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ముఖ్య కార్య దర్శి సందీపకుమార్‌ సుల్తానియా చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి, సహాయ అధికారి శ్రీనివాస్‌లను కలెక్టర్‌ అభి నందించారు

బ్యాంకు లింకేజీలో జిల్లాకు ప్రథమ స్థానం
అవార్డు సాధించిన అధికారులతో కలెక్టర్‌ భారతి హోళికేరీ

మంచిర్యాల కలెక్టరేట్‌, మే 20: బ్యాంకు లింకేజీలో జిల్లా ప్రథమ స్థానంలో రావడం అభినందనీయమని  కలెక్టర్‌ భారతి హోళికేరీ పేర్కొన్నారు. ఈనెల 18న హైద్రాబాద్‌లో జరిగిన బ్యాంకు లింకేజీ లాంచింగ్‌లో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ముఖ్య కార్య దర్శి సందీపకుమార్‌ సుల్తానియా చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి, సహాయ అధికారి శ్రీనివాస్‌లను కలెక్టర్‌ అభి నందించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ బ్యాంకు లింకేజీలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి 8,156 స్వయం సహా యక సంఘాలకు రూ. 282.01 కోట్లు లక్ష్యం కాగా 108 శాతంతో 6,624 సంఘాలకు రూ. 304.93 కోట్లు మంజూరు చేశామన్నారు. లింకేజీ ఎన్‌పీఏ రికవరి 99.27 శాతం చేశామన్నారు. లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించడంలో అధికారులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీపీఎం స్వర్ణలత  పాల్గొన్నారు. 

స్ధానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి 

జిల్లాలో త్వరలో నిర్వహించే జడ్పీటీసీ, సర్పంచు, ఎంపీటీసీలు, వార్డు సభ్యుల స్ధానాల ఎన్నికలకు ఏర్పా ట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ భారతి హోళికేరీ సూచిం చారు. కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్‌తోపాటు రాజకీయ పార్టీల నాయకులతో పోలింగ్‌ కేంద్రాల ముసాయిదా తయారుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మందమర్రి మండలం చిర్రకుంట, చె న్నూరు మండలం మద్దికల్‌లలో ఎంపీటీసీల స్థానాలు, 9 సర్పంచు, 367 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నిర్వహణకు 388 పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి ముసా యిదాలో పొందుపర్చామన్నారు. ఆయా పోలింగ్‌ కేం ద్రాల పరిధిలో 20,073 మంది పురుషులు, 25,717 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు పోలింగ్‌ కేంద్రాల ముజాయిదా తుది జాబితా ప్రచురణకు సిద్ధం అవుతుందని తెలిపారు.  పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. 

వైకుంఠధామాల్లో మౌలిక వసతులు కల్పించాలి 

జిల్లాలోని వైకుంఠధామాల్లో మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్‌ భారతి హోళికేరీ పేర్కొన్నారు.  కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ 311 గ్రామాల్లో ఏర్పాటు చేసిన వైకుంఠధామాలకు విద్యుత్‌, నీటి వసతి పనులను పది రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. వంద మీటర్లలోపు ఉన్న వాటికి విద్యుత్‌ ఉచిత కనెక్షన్‌ ఇవ్వాలని, వంద మీటర్ల పైబడిన వాటికి సంబంధించి రుసుం చెల్లించి కనెక్షన్‌ ఇవ్వాలన్నారు. మన ఊరు మన బడిలో చేపట్టిన పనులను పాఠశాలల ప్రారంభంలోగా పూర్తి చేయాలన్నారు. క్రీడా ప్రాంగణానికి ఒక ఒకరం  చొప్పున మండలంలో 2 ఏర్పాటు చేయాలని, జిల్లాలో 16 మండలాలకు 32 ఎకరాల భూమిని గుర్తించి గ్రౌం డింగ్‌, చదును పనులను తక్షణమే ప్రారంభించాల న్నారు. జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్‌, జిల్లా గ్రామీణాబివృద్ధి అధికారి శేషాద్రి, పంచాయతీరాజ్‌ ఈఈ జాదవ్‌ ప్రకాష్‌ పాల్గొన్నారు. 

ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలి 

చెన్నూరురూరల్‌: ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని కలెక్టర్‌ భారతి హోళికేరీ పేర్కొన్నారు. కిష్టంపేటలో ఐకేపీ, డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్‌ పరిశీలిం చారు. కొనుగోలు కేంద్రంలో హమాలీలు లేకపోవ డంతో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  కొను గోలు చేసిన ధాన్యాన్ని మార్కెట్‌ గోదాముల్లో భద్రపర్చి లారీల్లో లోడ్‌ చేయాలని తెలిపారు. రైతులు దళా రులను నమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు  విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. కలెక్టర్‌ వెంట తహసీ ల్దార్‌ శ్రీనివాస్‌దేశ్‌పాండే, సర్పంచు బుర్ర రాకేష్‌గౌడ్‌ , రైతులు ఉన్నారు. 

Updated Date - 2022-05-21T03:32:49+05:30 IST