ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ ఫలితాల్లో జిల్లాకు రెండో స్థానం

ABN , First Publish Date - 2022-06-29T04:33:31+05:30 IST

ఇంటర్‌ ఫలితాల్లో కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా విద్యార్థులు విజయ కేతనం ఎగురవేశారు. మంగళవారం వెలువ రించిన ఫలితాల్లో రెండో ఏడాది ఇంటర్‌లో రెండో స్థానం(77శాతం)లో జిల్లా విద్యార్థులు నిలిచారు.

ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ ఫలితాల్లో జిల్లాకు రెండో స్థానం
లోగో

- మొదటి ఏడాదిలో తృతీయ స్థానంలో నిలిచిన విద్యార్థులు

- రెండింటిలోనూ సత్తా చాటిన బాలికలు 

- ప్రభుత్వ కళాశాలలకు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు 

ఆసిఫాబాద్‌, జూన్‌ 28:  ఇంటర్‌ ఫలితాల్లో కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా విద్యార్థులు విజయ కేతనం ఎగురవేశారు. మంగళవారం వెలువ రించిన ఫలితాల్లో రెండో ఏడాది ఇంటర్‌లో రెండో స్థానం(77శాతం)లో జిల్లా విద్యార్థులు నిలిచారు.  ప్రథమ సంవత్సరంలో తృతీయ స్థానాల్లో నిలిచారు. ఇంటర్‌ మొదటి ఏడాది ఫలితాల్లో  తృతీయ స్థానం(72శాతం)లో నిలిచారు. ప్రథమ, ద్వితీయ ఫలితాల్లో జిల్లాలో బాలికలదే పై చేయిగా నిలిచింది. జిల్లా నుంచి ప్రథమ సంవత్సరంలో మొత్తం 4,426 మంది విద్యార్థులు పరీక్ష రాయగా ఇందులో 2072 మంది బాలురు, 2354 మంది బాలికలు ఉన్నారు. ఇందులో 1354 మంది బాలురు, 1846 మంది బాలికలు మొత్తం 3200 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 72 శాతం ఉత్తీర్ణత సాధించారు. దీంతో 78 శాతం మంది బాలికలు, 65 శాతం మంది బాలురు ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 4060 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఇందు 2069 బాలురు, 1991 బాలికలు ఉన్నారు. వీరిలో 1563 మంది బాలురు, 1581 మంది బాలికలు మొత్తం 3144 మంది ఉత్తీర్ణులు కాగా 77 శాతంగా ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలికలు 79 శాతం ఉత్తీర్ణత కాగా, బాలురు 75 శాతం ఉత్తీర్ణులయ్యారు. దీంతో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో బాలికలు పై చేయి సాధించారు.  ఆసిఫాబాద్‌ ఆదర్శ కళాశాల విద్యార్థి సాయి శ్రీతేజ ఎంపీసీ గ్రూపులో 1000 మార్కులకు గాను 976 మార్కులు సాధించారు. అలాగే ఆసిఫాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ ఆదర్శ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. కళాశాలలో ఎంపీసీ గ్రూపులో అభిరాంకు 1000 మార్కులకు గాను 953 మార్కులు సాధించాడు. జిల్లాకు రాష్ట్రంలోనే ద్వితీయ, తృతీయ స్థానాలు రావడంతో జిల్లా ఇంటర్‌ విద్యాధికారిణి, కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులను అభినందించారు. 

కాగజ్‌నగర్‌: రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన ఇంటర్‌ ఫలితాల్లో కాగజ్‌నగర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు కుమరం భీం జిల్లా టాపర్లుగా నిలిచారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎంపీసీ సెకండరీయల్‌లో జెల్ల అమన్‌కు 990/1000 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలవడం విశేషం. అలాగే రాష్ట్ర ర్యాంకు జాబితాలో మొదటి స్థానంలో ఉన్నట్టు తెలిసింది. ప్రవల్లిక ఎంపీసీలో 962/1000 మార్కులు సాఽధించడం విశే షం. జిల్లాల వారీగా వచ్చిన పరిశీలిస్తే ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ ఫలితాల్లో కుమరం భీం జిల్లా ద్వితియా స్థానంలో నిలిచినట్లు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీధర్‌ సుమన్‌ తెలిపారు. కాగా పట్టణానికి చెందిన యాదగిరిపూజ దంపతుల కుమారుడు జెల్ల అమన్‌ చిన్నప్పటి నుంచి టాపర్‌గా నిలువటం విశేషం. ఈ సందర్భంగా ఆ990/1000 మార్కులు సాధించిన అమన్‌ మట్లాడుతూ సివిల్స్‌కు ప్రిపేర్‌ కావడమే లక్ష్యమని చెప్పాడు. ప్రస్తుతం ఐఐటీ రాస్తున్నానని అన్నాడు. తన లక్ష్యం కోసం తన తల్లిదండ్రులు యాదగిరిపూజ ఎంతగానో సహకరించారని తెలిపాడు. కాగజ్‌నగర్‌ వివేకనంద జూనియర్‌ విద్యార్థులు హావా కొనసాగించారు. ఇంటర్‌ సెకండియర్‌ విభాగంలో కుషి సహ970/1000, అనురాగ్‌ సర్ధార్‌ 961/1000, కొండ సౌమ్య961/1000, భీక్రం మిస్త్రి 961/1000 రాణించినట్టు ప్రిన్సిపాల్‌ హనుక్‌ తెలిపారు. బీపీసీ సెకండరీయర్‌లో భావన 987/1000, అల్గం శ్రావణి 984/1000, అంజలి తివారి 980/1000,  ఎంఈసీ మొదటి సంవత్సరంలో శ్రీతి రాయ్‌ 484/500, ప్రచి అగర్వాల్‌ 483, సీఈసీ మొదటి సంవత్సరంలో దేవ్‌కుమార్‌ 472/500, త్రిషా చౌహన్‌ 471/500 మార్కులు సాధించినట్టు తెలిపారు. ఎంపీసీ మొదటి సంవత్సరంలో శ్రీయ 463/470, పొన్న మోఘన 461/470, బైపీసీ విభాగంలో జహాన్నవి 433/440, షంషాద్‌ బేబీ 431/440, హర్షీణ్‌ ఖానాం 430/440  మార్కులు పొందినట్టు ప్రిన్సిపాల్‌ వివరించారు. 

దహెగాం : దహెగాం మండలంలోని ప్రభుత్వ జూనిర్‌ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో 90 శాతం, ద్వితీయ సంవత్సరంలో 97 వాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్‌ అమరేందర్‌ పేర్కొన్నారు. కళాశాలకు చెందిన విద్యార్థిని రేణుక బైపీసీలో 1000 మార్కులకు గాను 942 మార్కులు సాదించి ప్రథమ స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు. అలాగే మొదటి సంవత్సరంలో కేజీబీవీ కళాశాలకు చెందిన విద్యార్థిని 440 మార్కులకు గాను 432 మార్కులు సాధించనట్లు తెలిపారు. 

కెరమెరి: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మొదటి సంవత్సరంలో 148 మందికి గాను 116, ద్వితీయ సంవత్సరంలో 153 మందిక గాను 127 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్‌ పరుశరాములు తెలిపారు. ద్వితీయ సంవత్సరంలో బైపీసీ విద్యార్థిని ఆర్తి 923 మార్కులు, జి.అంజలి 897 మార్కులు సాధించారు. ప్రథమ సంవత్సరంలో డి.మహేశ్వరి 410 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచినట్లు తెలిపారు. 

తిర్యాణి:  తిర్యాణి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 97 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్‌ లక్ష్మణ్‌ తెలిపారు. ద్వితీయ సంవత్సరంలో 76 మందికి గాను 74 మంది, ప్రథమ సంవత్సరంలో 80 మందికి గాను 71 మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ గ్రూపుకు చెందిన సాహిత్య 947 మార్కులు, థ్రమ సంవత్సరంలో ఎంపీసీ గ్రూపులో విద్యార్థిని అనూష 434 మార్కులు సాధించినట్లు తెలిపారు. అలాగే సీఈసీ ద్వితీ య సంవత్సరంలో విద్యార్థి రవికష్ణ 821 మార్కులు, ప్రథమ సంవ త్సరంలో బైపీసీలో చంద్రకళ 399 మార్కులు, సీఈసీలో అన్నం శ్రావణ్‌ 358 మార్కులు సాధించి కళాశాల టాపర్లుగా నిలిచినట్లు తెలిపారు.

బెజ్జూరు: బెజ్జూరు ప్రభుత్వ జూనిర్‌ కళాశాలలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాదించినట్లు ప్రిన్సిపాల్‌ తెలిపారు. కళా శాలలో ప్రథమ సంవత్సరంలో 154 మందికి గాను 151 మంది ఉత్తీర్ణత సాధించగా ద్వితీయ సంవత్సరంలో 183 మందికి గాను 168 మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ విద్యార్థి జగదీష్‌ 1000/898 మార్కులు, రాజ్‌ కుమార్‌ సీఈసీలో 1000/743 మార్కులు, బాలకృష్ణ బైపీసీలో 1000/906 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు.

కౌటాల: ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో కౌటాల ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. మొదటి సంవత్సరంలో 382  మందికి గాను 370 మంది, ద్వితీయ సంవత్సరంలో 386 మందికి గాను 374 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సి పాల్‌ సకవరూప తెలిపారు. కళాశాలలో మొదటి సంవత్సరంకు చెందిన అంజన్న 444/470, ద్వితీయ సంత్సరంలో కావుడే కార్తీక్‌ 1000/916, ఒకేషనల్‌లో మొదటి సం వత్సరంలో సాయికుమార్‌ 482/500, ద్వితీయ సంవత్సరంలో అనూష 1000/960 మార్కులు సాధించినట్లు తెలిపారు.

వాంకిడి: వాంకిడి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 98 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్‌ సంపత్‌కుమార్‌ తెలిపారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 160 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 157 మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌లో 130 మంది పరీక్షలు రాయగా 122 మంది ఉత్తీర్ణులైనారన్నారు. 

జైనూరు: ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలో 96 శాతం ఫలితాలు సాధించామని ప్రిన్సిపాల్‌ శ్రీదేవి తెలిపారు. ఎంపీసి మొదటి సంవత్సరంలో పెందుర్‌ రాజు 470కు గాను 451, బిబిసి మొదటి సంవత్సరం ఇంగ్లీష్‌ మిడియంలో శ్రీహర్ష 440 మార్కులకు గాను 424. కె. లావణ్య 440కి 418, ఆదేవిధంగా దీపిక 440కు 410 మార్కులు సాధించారు. సిఇసిలోమొదటి సంవత్సరంలో మరస్కోల జంగు 500 మార్కులకు 405,  ఎంపీసి ద్వితీయ సంవత్సరంలో యాసీన్‌ 1000కి 920 సాధించి కళాశాలకు గుర్తింపు తెచ్చారని ఆమె తెలిపారు.

సిర్పూర్‌(యూ): మండలంలో మొత్తం 208 మంది విద్యార్థులు ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలు రాశారు.అందులో మొత్తం 186 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాదించారు.అదే విధంగా తెలంగాణ ఆదర్శ పాఠశాలకు చెందిన జాన్సీ 1000 మార్కులకుగాను 928 మార్కులు సాదించి మండల టాపర్‌గా నిలిచింది. 

Updated Date - 2022-06-29T04:33:31+05:30 IST