Advertisement

వైద్య దంప‌తుల‌ను విడ‌దీసిన క‌రోనా.... అత‌ను యోధుడు: భార్య‌

Jun 30 2020 @ 09:35AM

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రి వైద్యుడి భార్య తన భర్తను యోధునిగా గుర్తుంచుకుంటామని తెలిపారు. ఢిల్లీకి చెందిన‌ డాక్టర్ డాక్టర్ అసిమ్ గుప్తా(52) క‌రోనా బారిన‌ప‌డి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. ఈ సంద‌ర్భంగా అత‌ని భార్య డాక్టర్ నిరుపమ ఆత్రేయ మాట్లాడుతూ.... జూన్ 2 న మా ఇద్దరికీ కరోనా పాజిటివ్ అని నిర్థార‌ణ జ‌రిగింది. ప్రారంభంలో తేలికపాటి లక్షణాలు ఉన్న‌కార‌ణంగా మ‌మ్మ‌ల్ని హోంక్వారంటైన్‌లో ఉంచారు. త‌రువాత ఆరోగ్యం బాగోలేద‌ని మాకు అనిపించ‌డంతో ఆసుపత్రికి తరలించారు. నా భర్త, నేను మొదట ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రిలో, తరువాత సాకేత్‌లోని మాక్స్ ఆసుపత్రిలో చేరాం. మా ఇద్దరికీ తీవ్ర‌మైన జ్వరం వచ్చింది. నాకు జ్వరం తగ్గినా, అత‌ని ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించి క‌న్నుమూశారు. అతను యోధుడు. కోవిడ్ -19 హీరో. కోవిడ్ -19తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. మాపెద్ద కుమారుడు అక్షత్ సిడ్నీలో ఉంటున్నాడు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అతను తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదు. చిన్న కుమారుడు ఆర్యన్ డెహ్రాడూన్ మెడికల్ కాలేజీలో రెండవ సంవత్సరం చ‌దువుతున్నాడు. మా కొడుకు చదువు పూర్తి చేసి, తన తండ్రిలాగే డాక్టర్ అవుతాడని చెప్పారు. కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డాక్టర్ గుప్తా కుటుంబానికి ఒక కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. 

Follow Us on:
Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.