నగరంలో తాగునీటి సమస్య పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-06-28T05:21:54+05:30 IST

ఒంగోలు నగరంలో మంచినీటి సమస్య పరిష్కరించాలని, మౌలిక వసతుల కల్పనకు రూ. 500 కోట్లు నిధులు విడుదల చేయాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద ఽసోమవారం ధర్నా నిర్వహించారు. ధర్నాలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జీవి కొండారెడ్డి మాట్లాడుతూ మునిసిపల్‌ పాలకవర్గం మంచినీటి సమస్యను పరిష్కరించడంలో విఫలమైందని దుయ్యబట్టారు.

నగరంలో తాగునీటి సమస్య పరిష్కరించాలి
ధర్నాలో మాట్లాతున్న జీవీ కొండారెడ్డి

- సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా 

ఒంగోలు (కార్పొరేషన్‌), జూన్‌ 27 : ఒంగోలు నగరంలో మంచినీటి సమస్య పరిష్కరించాలని, మౌలిక వసతుల కల్పనకు రూ. 500 కోట్లు నిధులు విడుదల చేయాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద ఽసోమవారం ధర్నా నిర్వహించారు. ధర్నాలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జీవి కొండారెడ్డి మాట్లాడుతూ   మునిసిపల్‌ పాలకవర్గం మంచినీటి సమస్యను పరిష్కరించడంలో విఫలమైందని దుయ్యబట్టారు. ముందుచూపుతో వ్యవహరించని కారణంగా నగరంలో నాలుగు రోజులకొకసారి నీరు విడుదలవుతుందని, అది కూడా వేళా పాళా లేకుండా, సమయపాలన పాటించకుండా ఇవ్వడంతో ప్రజలు అల్లాడుతున్నారని అన్నారు. నగర కార్యదర్శి జి. రమేష్‌ మాట్లాడుతూ నగరంలో కనీస అభివృద్ధి పనులు జరగడం లేదని, నిధులు రాబట్టడంలో పాలకవర్గం పూర్తిగా విఫలమైందని అన్నారు. వీధి వ్యాపారుల వద్ద ఆశీలు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారని, కనీస రశీదులు కూడా ఇవ్వకుండా చిరువ్యాపారులను దోచేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దామా శ్రీనివాసులు, అత్తింటి శ్రీను, శ్రీరామ్‌ శ్రీను, కే బాబు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం మేయర్‌ గంగాడ సుజాతను కలిసి వినతి పత్రం అందజేశారు.




Updated Date - 2022-06-28T05:21:54+05:30 IST