ఓ వైపు ట్రక్కు, మరో వైపు కారు, మధ్యలో డ్రైవర్.. మనోడి టైం బాగుంది..!

ABN , First Publish Date - 2021-10-22T03:48:11+05:30 IST

బ్రెజిల్ క్యాంపినాస్‌కు చెందిన ఓ డ్రైవర్‌ తన ట్రక్‌పై కారును తీసుకెళ్తున్నాడు. మధ్యలో రోడ్డు ఎత్తుగా ఉండడంతో ప్రమాదవశాత్తు లారీలోని కారు కింద పడింది. గమనించిన డ్రైవర్.. కారును ఆపేందుకు వెళ్లాడు. అయితే ఈ కంగారులో లారీని ఎత్తులో ఆపి వెళ్లాడు.

ఓ వైపు ట్రక్కు, మరో వైపు కారు, మధ్యలో డ్రైవర్.. మనోడి టైం బాగుంది..!

ఒక్కోసారి చిన్న చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు కూడా పలువురు ప్రాణాలు కోల్పోతుంటారు. ఇంకొన్నిసార్లు పెద్ద ప్రమాదాలు జరిగిన సందర్భంలో చిన్న గీటు కూడా పడకుండా బయటపడుతుంటారు. మరికొన్ని సార్లు ఇంకా పెద్దపెద్ద ప్రమాదాల నుంచి కొద్దిలో తప్పించుకుంటూ ఉంటారు కొందరు. అలాంటప్పుడే.. వీడి టైం బాగుందిరా.. అని అంటూ ఉంటారు.. బ్రెజిల్లో కూడా ఓ వ్యక్తి పెద్ద ప్రమాదం నుంచి కొద్దిలో తప్పించుకున్నాడు.. వైరల్ అవుతున్న ఈ వీడియో వివరాల్లోకి వెళితే...


బ్రెజిల్ క్యాంపినాస్‌కు చెందిన ఓ డ్రైవర్‌ తన ట్రక్‌పై కారును తీసుకెళ్తున్నాడు. మధ్యలో రోడ్డు ఎత్తుగా ఉండడంతో ప్రమాదవశాత్తు లారీలోని కారు కింద పడింది. గమనించిన డ్రైవర్.. కారును ఆపేందుకు వెళ్లాడు. అయితే ఈ కంగారులో లారీని ఎత్తులో ఆపి వెళ్లాడు. తీరా కారు ఆగగానే డ్రైవర్ ఊపిరి పీల్చుకున్నాడు. అయితే అంతలోనే తాను ఆపిన లారీ వెనక్కు దూసుకొస్తోంది. తీరా కారును ఢీకొడుతుందనగా.. సడన్‌గా పక్కకు జరిగాడు. దీంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. కారును ఢీకొన్న లారీ, మళ్లీ ఓ చెట్టును ఢీకొని ఆగిపోయింది. లారీ దిగి వచ్చే సమయంలో హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో ఇంత ప్రమాదం జరిగిందని డ్రైవర్ తర్వాత తెలుసుకున్నాడు. ఈనెల 11న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Updated Date - 2021-10-22T03:48:11+05:30 IST