పేదల ఆర్థికాభివృద్ధే సీఎం లక్ష్యం

ABN , First Publish Date - 2020-08-08T10:13:46+05:30 IST

తెలంగాణలో సంపదను సృష్టించి పేదలకు పంచడం, వారి ఆర్థికాభివృద్ధే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని పశుసంవర్ధక

పేదల ఆర్థికాభివృద్ధే సీఎం లక్ష్యం

 రైతు వేదికలు అన్నదాతలకు ఎంతో కీలకం  

 మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ 


హుజూర్‌నగర్‌, కోదాడ, సూర్యాపేటరూరల్‌, ఆగస్టు 7: తెలంగాణలో సంపదను సృష్టించి పేదలకు పంచడం, వారి ఆర్థికాభివృద్ధే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ అన్నారు. శుక్రవారం హుజూర్‌నగర్‌లోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో కలిసి 25 మంది లబ్ధిదారులకు రూ. 30లక్షల సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం లింగగిరిలో పశువైద్యశాలలో టీకా కార్యక్రమాన్ని పరిశీలించారు. అంతకుముందు కోదాడ పెద్ద చెరువులో రూ.4.40లక్షలు విలువ చేసే చేప పిల్లలను వదిలారు. అనంతరం కృత్రిమ గర్భధారణతో జన్మించిన లేగదూడల ప్రదర్శనను తిలకించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడారు. నాణ్యమైన చేపపిల్లలను ప్రభుత్వం సరఫరా చేస్తోందని, నాసిర కం ఉంటే వాహనాలను వెనక్కు పంపాలన్నారు. రాష్ట్రంలో 80కోట్ల చేప పిల్లలు, 5 కోట్ల రొయ్య పిల్లలను చెరువుల్లో వదిలామన్నారు. జాగ్రత్తలు తీసుకుంటే కరోనా దరిచేరదన్నారు.


కొన్ని  పనికిరాని పార్టీలు ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామంటున్నాయని, ఆ పార్టీ నాయకులను అరె్‌స్టచేసి లోపల వేస్తారన్నారు. రైతు వేదికలతో అన్నదాతలకు మేలు జరుగుతుందన్నారు. రాష్ట్రంలో పశువైద్యశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. గోపాలమిత్రలకు ఎక్కడా లేనివిధంగా రూ.8వేలు వేతనంగా ఇస్తున్నామన్నారు. ఈ సందర్భంగా గోపాలమిత్రలకు చెక్కులు పంపిణీ చేశారు. కొమరబండలో హరితహారంలో భాగంగా మొక్క నాటారు. రాష్ట్రంలో గొర్రెలు 50శాతం పంపిణీ చేయ గా, మిగతా 50శాతం అతిత్వరలో ఇస్తామన్నారు. సివిల్స్‌లో 244 ర్యాంక్‌ సాధించిన హు జూర్‌నగర్‌కు చెందిన పిన్నాని సందీ్‌పను ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమా ల్లో కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్‌, హుజూర్‌నగర్‌ మునిసిపల్‌ చైర్మన్‌ గెల్లి అర్చనరవి, వైస్‌చైర్మన్‌ జక్కుల నాగేశ్వరరావు, చిట్యాల అమర్‌నాథ్‌రెడ్డి, సంపత్‌రెడ్డి, శంభయ్య, నాగేశ్వరావు, ఎంపీపీ గూడెపు శ్రీనివాసు, జడ్పీటీసీలు కొప్పుల సైదిరెడ్డి, పిన్నాని కోటేశ్వరరావు, ప్రభావతి, సంపత్‌వర్మ, ఆర్డీవో ఎల్‌.కిషోర్‌కుమార్‌, పశుసంవర్ధక శాఖ సంచాలకుడు లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-08T10:13:46+05:30 IST