బీజేపీ హయాంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం

ABN , First Publish Date - 2022-05-26T06:05:03+05:30 IST

అంబానీ, అదానీలకు ప్రభుత్వరంగ సంస్థలను కట్టబెట్టి దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యోచిస్తున్నదని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు వరసాల శ్రీనివాసరావు ఆరోపించారు.

బీజేపీ హయాంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం
రిలే దీక్షల శిబిరంలో ప్రసంగిస్తున్న వరసాల శ్రీనివాసరావు

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు వరసాల శ్రీనివాసరావు

కూర్మన్నపాలెం, మే 25: అంబానీ, అదానీలకు ప్రభుత్వరంగ సంస్థలను కట్టబెట్టి  దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యోచిస్తున్నదని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు వరసాల శ్రీనివాసరావు ఆరోపించారు. కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం నాటికి 468వ రోజుకు చేరుకున్నాయి. ఈ శిబిరంలో వరసాల మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని ఆరోపించారు. పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడమే మోదీ ధ్యేయంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. పోరాట కమిటీ మరో చైర్మన్‌ మంత్రి రాజశేఖర్‌ మాట్లాడుతూ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి కార్మికుడిపై ఉందన్నారు. పోరాట కమిటీ నాయకులు అయోధ్యరామ్‌, కేఎస్‌ఎన్‌ రావు, గంధం వెంకటరావు, మస్తానప్ప, గంగవరం గోపి, వేములపాటి ప్రసాద్‌, జి.ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-26T06:05:03+05:30 IST