ఉక్కపోత... కుండపోత!

ABN , First Publish Date - 2021-05-30T05:24:24+05:30 IST

జిల్లాలో పగటిపూట వేసవి తీవ్రత దారుణంగా ఉంటుండగా... సాయంత్రం వేళ వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉదయమంతా ఉష్ణోగ్రతల ప్రభావంతో... ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సాయంత్రం పూట గాలీవాన బీభత్సంతో ఇబ్బందులు పడుతున్నారు. శనివారం ఉదయం మెళియాపుట్టిలో అత్యధికంగా 41.58 డిగ్రీలు, అత్యల్పంగా శ్రీకాకుళంలో 26.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం నుంచి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి.

ఉక్కపోత... కుండపోత!
పాలకొండ రోడ్డు-డేఅండ్‌ నైట్‌ జంక్షన్‌ వద్ద కురుస్తున్న వర్షం

జిల్లాలో ఉదయం ఎండల ప్రభావం

సాయంత్రం గాలీవాన బీభత్సం

మెళియాపుట్టిలో భారీవర్షం

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

జిల్లాలో పగటిపూట వేసవి తీవ్రత దారుణంగా ఉంటుండగా... సాయంత్రం వేళ వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉదయమంతా ఉష్ణోగ్రతల ప్రభావంతో... ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సాయంత్రం పూట గాలీవాన బీభత్సంతో ఇబ్బందులు పడుతున్నారు. శనివారం ఉదయం మెళియాపుట్టిలో అత్యధికంగా 41.58 డిగ్రీలు, అత్యల్పంగా శ్రీకాకుళంలో 26.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం నుంచి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. శ్రీకాకుళం నగరంలో ఉన్న అనేక హోర్డింగ్‌లు చిరిగిపోయాయి. కంచిలి, కవిటి, ఇచ్ఛాపురం, పాలకొండ, సీతంపేట, గార, శ్రీకాకుళం రూరల్‌, ఆమదాలవలస మండలాల్లో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి.  కొన్ని గంటల పాటు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత ఉరుములు, మెరుపులతో కుండపోతగా వర్షం కురిసింది. మెళియాపుట్టి మండలంలో అత్యధికంగా 33.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా కంచిలి, బూర్జ, రాజాం మండలాల్లో 0.25 మి.మీ వర్షం కురిసింది. కొన్ని మండలాల్లో ఒకచోట అధికంగా...మరోచోట తక్కువగా వర్షపాతం నమోదైంది. 

- ఎల్‌.ఎన్‌.పేట మండల కేంద్రంలో 26.75 మి.మీ వర్షపాతం నమోదవ్వగా.. అదే మండలం కోవిలాం గ్రామంలో 31.5 మి.మీ వర్షం కురిసింది. 

- ఆమదాలవలస మండలం తిమ్మాపురంలో 27 మి.మీ. వర్షం కురవగా... చింతాడలో 25.5 మి.మీ, మెట్టక్కివలసలో 15.0 మి.మీ వర్షం కురిసింది. 

- శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వద్ద 23.75 మి.మీ వర్షం కురవగా... ఆర్‌అండ్‌బీ అతిథి గృహం సమీపంలో కేవలం 9.5 మి.మీ వర్షం కురిసింది.

- హిరమండలం ప్రాంతంలో 4.5 మి.మీ. వర్షం కురవగా... అదే మండలంలో గొట్టాబ్యారేజీ వద్ద కేవలం 1.75 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ రీతిలో వర్షంలో వ్యత్యాసం కనిపించింది. 


 జిల్లాలో శనివారం నమోదైన వర్షపాతం...(మిల్లీ మీటర్లలో) :

--------------------------------------

మెళియాపుట్టి 33.5

ఎల్‌.ఎన్‌.పేట 31.5

సీతంపేట 28.5

ఆమదాలవలస 27.0

శ్రీకాకుళం 23.75

వీరఘట్టం 11.5

సరుబుజ్జిలి 7.75

హిరమండలం 4.5

కోటబొమ్మాళి 4.0

గార 2.75

నరసన్నపేట 2.0

రణస్థలం 1.5

లావేరు 1.25

పాలకొండ 1.0

పలాస 0.75

బూర్జ 0.25

రాజాం 0.25

కంచిలి 0.25

Updated Date - 2021-05-30T05:24:24+05:30 IST