విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2022-08-09T05:33:23+05:30 IST

వినియోగదారులు, ఉద్యోగులు, సిబ్బందికి శాపంగా మారనున్న విద్యుత్‌ సవరణ బిల్లు-2022ను వెంటనే ఉపసంహరించుకోవాలని విద్యుత్‌ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి(తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఎంప్లా యీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ) మహబూబ్‌నగర్‌ జిల్లా కమిటీ కన్వీనర్‌ డి.చంద్రమౌళి డిమాండ్‌ చేశారు.

విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి
నిరసన వ్యక్తం చేస్తున్న విద్యుత్‌ జేఏసీ నాయకులు

- విద్యుత్‌ సంస్థను కాపాడుకుంటేనే మనుగడ

- జిల్లా జేఏసీ కన్వీనర్‌ డి.చంద్రమౌళి

పాలమూరు, ఆగస్టు 8 : వినియోగదారులు, ఉద్యోగులు, సిబ్బందికి శాపంగా మారనున్న విద్యుత్‌ సవరణ బిల్లు-2022ను వెంటనే  ఉపసంహరించుకోవాలని విద్యుత్‌ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి(తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఎంప్లా యీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ) మహబూబ్‌నగర్‌ జిల్లా కమిటీ కన్వీనర్‌ డి.చంద్రమౌళి డిమాండ్‌ చేశారు.  నూతన సవరణ చట్టాన్ని సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర  కమిటీ  పిలుపుమేరకు  జిల్లా కేంద్రంలోని విద్యుత్‌ భవన్‌ ఎదుట మహాధర్నా నిర్వహించారు.  ఈ సందర్భంగా  నాయకులు మాట్లాడుతూ ఉద్యో గులు, వినియోగదారులు, వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం చట్ట స వరణకు సిద్ధపడాలనుకోవడం శోచనీయమన్నారు.  కొత్త బిల్లు వల్ల అత్యవసర సేవలందించే వర్గాలకు సైతం సబ్సిడీలు కరువయ్యే ప్రమాదం ఉందని,  ప్రజ ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర తన నిర్ణయాన్ని మార్చుకోవాల ని కోరారు.  లేనిపక్షంలో అన్నియూనియన్ల ఆధ్వర్యంలో  నిరవధిక సమ్మెకు సిద్ధపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఈలు సంజీవరెడ్డి, ఏడీలు యం.నవీన్‌కుమార్‌, చంద్రశేఖర్‌, సంతోష్‌, అనంతయ్య, యశోధ, ఏఈలు, ఉద్యో గులు, కార్మికులు, సంఘాల ప్రతినిధులు జి.స్వామి, పాండు, బాబ్యనాయక్‌, కె.ఎల్‌ శ్రీనివాస్‌, లింగంగౌడ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-09T05:33:23+05:30 IST