టీఆర్‌ఎస్‌ నేతల దోపిడీని ప్రశ్నించాలి : ఉత్తమ్‌

ABN , First Publish Date - 2022-05-26T06:34:43+05:30 IST

టీఆర్‌ఎస్‌ నాయకుల దోపిడీ ని ప్రజలు ప్రశ్నించాలని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని కరక్కాయలగూడెం, మర్రిగూ డెం, వేపలసింగారం గ్రామాల్లో బుధవారం నిర్వహించిన రైతు రచ్చబండలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మె ల్యే, అధికార పార్టీ నాయకులు ల్యాండ్‌, శాండ్‌, వైన్‌ మాఫి యా నడుపుతున్నారని ఆరోపించారు.

టీఆర్‌ఎస్‌ నేతల దోపిడీని ప్రశ్నించాలి : ఉత్తమ్‌
కరక్కాయల గూడెంలో మాట్లాడుతున్న ఉత్తమ్‌

హుజూర్‌నగర్‌, మే 25: టీఆర్‌ఎస్‌ నాయకుల దోపిడీ ని ప్రజలు ప్రశ్నించాలని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని కరక్కాయలగూడెం, మర్రిగూ డెం, వేపలసింగారం గ్రామాల్లో బుధవారం నిర్వహించిన రైతు రచ్చబండలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మె ల్యే, అధికార పార్టీ నాయకులు ల్యాండ్‌, శాండ్‌, వైన్‌ మాఫి యా నడుపుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందన్నారు. వరంగల్‌ డిక్లరేషన్‌ను కాంగ్రెస్‌ అమలు చేస్తుందని, అధికారంలోకి రాగానే రూ.2లక్షలు రుణమాఫీ, ఏకకాలంలో రూ.1 లక్ష రుణమాఫీ చేస్తామన్నారు. కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు అండగా ఉంటామన్నారు, బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తామన్నారు. సమభావన సంఘాల మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ పాలకుల అవినీతిని ప్రశ్నించడంతో వాటిని కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం బూరుగడ్డ గ్రా మంలో శిథిలావస్థకు చేరిన 30 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పరిశీలించారు. బడుగు, బలహీన వర్గాల కోసం కాంగ్రెస్‌ హయాంలో బూరుగడ్డలో 2017లో స్థలం సేకరించి రెండు పడకల ఇళ్లను నిర్మించగా, వాటిని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎవ్వరికీ కేటాయించకపోవడంతో అవి శిథిలావస్థకు చేరాయన్నారు. కార్యక్రమంలో నాయకులు సుందరి వెంకటేశ్వర్లు, దొంగరి వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, చెక్కర వీరారెడ్డి, అరుణ్‌కుమార్‌ దేశ్‌ముఖ్‌, ఎండీ.నిజాముద్దీన్‌, ఈడుపుగంటి సుబ్బారావు, అల్లం ప్రభాకర్‌రెడ్డి, యరగాని నాగన్నగౌడ్‌, వట్టిముక్కల నిర్మల, మచ్చ వెంకటేశ్వర్లు, ఆదినారాయణరెడ్డి, కుందూరు శ్రీనివాసరెడ్డి, జయరాజు, తదితరులు పాల్గొన్నారు. 


రైతు సంక్షేమమే కాంగ్రెస్‌ ధ్యేయం : గీతారెడ్డి

కోదాడ రూరల్‌: రైతు సంక్షేమమే కాంగ్రెస్‌ ధ్యేయమని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గీతారెడ్డి అన్నారు. మండలంలోని కొమరబండ గ్రామంలో మంగళవారం రాత్రి నిర్వహించిన రచ్చబండలో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే నష్టపరిహారం ఇవ్వడం లేదని, పంజాబ్‌ రైతులకు మాత్రం పరిహారం ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రైతుల సంక్షేమం కోసమే రాహుల్‌గాంధీ వరంగల్‌ డిక్లరేషన్‌ ప్రకటించారన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌ నాయకులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయని అన్నారు. ఈ అరాచక ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలంతా కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరముందన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న, పార్టీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణరెడ్డి, వంగవీటి రామారావు, మాజీ సర్పంచ్‌ సంపెట రవిగౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-26T06:34:43+05:30 IST