కనుబొమల కనువిందు

ABN , First Publish Date - 2021-01-07T06:58:18+05:30 IST

ముఖానికి ఇంపైన ఆకృతి అందమైన కనుబొమలతోనే సాధ్యం. కాబట్టి వాటిని ట్వీజర్‌తో తీర్చిదిద్దడంలో

కనుబొమల కనువిందు

ముఖానికి ఇంపైన ఆకృతి అందమైన కనుబొమలతోనే సాధ్యం. కాబట్టి వాటిని ట్వీజర్‌తో తీర్చిదిద్దడంలో కొన్ని మెలకువలు పాటించాలి. అవేమిటంటే...


రెండు అద్దాలు: కనుబొమల వెంట్రుకలను ట్వీజర్‌తో తొలగించే సమయంలో రెండు అద్దాలు ఉపయోగించాలి. వాటిలో ఒకటి భూతద్దం అయి ఉండాలి. ట్వీజర్‌తో వెంట్రుకను తొలగించే సమయంలో, తొలగించిన తర్వాత మారే కనుబొమల ఆకారం సరిచూసుకోవడం కోసం ఇలా భిన్న అద్దాలు ఉపయోగించడం అవసరం.


ఒకే రోజు వద్దు: కనుబొమలకు తీరైన ఆకృతి ఇవ్వడం కోసం వెంట్రుకలను ఒకే రోజు తొలగించకూడదు. రోజుకు కొన్ని చొప్పున తొలగిస్తూ, కనుబొమలు పొందే ఆకారాన్ని గమనిస్తూ ఉండాలి. ఇలా విరామం పాటించడం వల్ల కనుబొమల తీరు దెబ్బతినకుండా ఉంటుంది.


అడుగు నుంచి: సాధారణంగా కనుబొమల పైన ఉండే వెంట్రుకల నుంచి ట్వీజింగ్‌ మొదలుపెడుతూ ఉంటారు. కానీ ఈ పద్ధతిలో ఏ చిన్న పొరపాటు జరిగినా కనుబొమల ఆకారం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వెంట్రుకలు తొలగించే క్రమం అడుగు నుంచి మొదలుపెట్టాలి. 


సహజసిద్ధ ఆకారం: కనుబొమలకు సహజసిద్ధంగా ఏర్పడిన ఆకారాన్ని అనుసరించి, అదనంగా పెరిగిన వెంట్రుకలను మాత్రమే తొలగించాలి. అలాకాకుండా అసలు రూపాన్ని మార్చేస్తూ, కొత్త రూపంలో తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే కనుబొమలు కృత్రిమ రూపాన్ని సంతరించుకుంటాయి.


ట్రిమ్మింగ్‌: అదనపు వెంట్రుకలుతొలగించిన తర్వాత భృకుటి దగ్గర ఎగుడుదిగుడుగా పెరిగిన వెంట్రుకలను బ్రష్‌తో దువ్విస్ర్టెయిట్‌ సిజర్స్‌తో ట్రిమ్‌ చేసుకోవాలి. కత్తిరించేటప్పుడు తక్కువ పరిమాణాల్లో కటింగ్‌ కొనసాగాలి.ఫ


Updated Date - 2021-01-07T06:58:18+05:30 IST