రైతులను ఆదుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం

ABN , First Publish Date - 2022-06-25T07:02:49+05:30 IST

రైతులను ఆదుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫ ల్యం చెందిందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు.

రైతులను ఆదుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం
ధర్మపురిలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

ధర్మపురి, జూన్‌ 24: రైతులను ఆదుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫ ల్యం చెందిందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. ధర్మపురిలో శుక్రవా రం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ధ ర్మపురి నియోజకవర్గంలో సాగు నీరు, వ్యవసాయ ఉత్పత్తులు, ధాన్యం సేకరణ లాంటి సమస్యలు అధికంగా ఉన్నాయన్నారు. రాష్ట్రం ఏర్పాటు అనంతరం మొదటి సారి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్‌ స్థానిక సమస్యలపై ఎమ్మెల్యేలతో చర్చించినట్లు తెలిపారు. రోళ్లవా గు ప్రాజెక్టు ఆధునీకీకరణ పనులకు రూ 60 కోట్లు నిధులు మంజూరు కాగా టెండర్‌ ప్రక్రియ కోసం రెండేళ్లు గడిచాయన్నారు. 2017లో శంకు స్థాపన జరిగిన ప్రాజెక్టు నిర్మాణ పనులకు నోచుకోలేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ 147 కోట్లు నిధులు ఖర్చు చేస్తేగాని ఫలితాలు పొందలేమని ఆయన అన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో చేపట్టిన గో దావరి ఎత్తిపోతల పథకాలు నిర్వహణ లోపం, పర్యవేక్షణ కరువై సక్ర మంగా నడవటం లేదన్నారు. రోళ్లవాగు ప్రాజెక్టు నుంచి ఉపకాలువ ద్వారా అక్కపెల్లి చెరు వులోకి నీరు వినియోగించుకునే అవకాశం ఉండ గా ఎత్తిపోతల పథకం దేనికన్నారు. నియోజకవర్గంలోని మండలాలకు చెందిన కాలువ చివరి భూములకు ఎస్సారెస్పీ ద్వారా నీరందడం లేదన్నారు. ఇంజనీరింగ్‌ వ్యవ స్థలో లస్కర్‌ పోస్టులు భర్తీ చేయకపోవటంతో దిగువ ప్రాంతాలకు సాగు నీరు చేరవేయడంలో ఆశించిన ఫలితాలు పొందలేమన్నారు. జిల్లాలో రైస్‌ మిల్లర్స్‌ దోపిడీని అరికట్టలేక పోతున్నా మని అదనపు కలెక్టర్‌కు వినతి పత్రాన్ని సమర్పించిన ఎమ్మెల్యే సంజ య్‌కుమార్‌ను ఆయన ప్రశంసించారు. అంతకు ముందు జీవన్‌రెడ్డి అనా రోగ్యంతో బాధపడుతున్న మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు సంగనభట్ల దినేష్‌ తల్లిని పరామర్శించారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, డీసీసీ ఉపాధ్యక్షులు జితేందర్‌రెడ్డి, మండల కాంగ్రెస్‌ అ ధ్యక్షులు దినేష్‌, మండల కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాజేష్‌, నియోజకవర్గ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు సింహరాజు ప్రసాద్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-25T07:02:49+05:30 IST