శాఖల సమన్వయంతోనే జాతర విజయవంతం

ABN , First Publish Date - 2021-01-22T05:38:20+05:30 IST

వివిధ శాఖల సమన్వయంతోనే శంబర పోలమాంబ జాతర విజయవంతమవుతుందని పార్వ తీపురం ఐటీడీఏ పీవో ఆర్‌.కూర్మనాథ్‌ అన్నారు

శాఖల సమన్వయంతోనే జాతర విజయవంతం
జాతర ఏర్పాట్లను పరిశీలిస్తున్న పీవో కూర్మనాథ్‌,

ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌

మక్కువ, జనవరి 21: వివిధ శాఖల సమన్వయంతోనే శంబర పోలమాంబ జాతర విజయవంతమవుతుందని పార్వ తీపురం ఐటీడీఏ పీవో ఆర్‌.కూర్మనాథ్‌ అన్నారు. శంబరలో జా తర ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతర సమయంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎటువంటి అవాంతరాలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. జాతర సమయంలో కాలం చెల్లిన తినుబండారాలు, పానియాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. వైద్య ఆరోగ్యశాఖ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి 108 వాహనాల ద్వారా అత్యవసర సర్వీసులు చేపట్టే నిమిత్తం తగిన ఏర్పాట్లు చేసుకో వాలన్నారు. చదురుగుడి, వనంగుడి పరిసరాల్లో పారిశుధ్య నిర్వహణ సక్రమయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో బీఎల్‌ నగేష్‌, ఎంపీడీవో సూర్య నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

 ఇబ్బందుల్లేకుండా చర్యలు : రాజన్నదొర

సాలూరు రూరల్‌: భక్తులకు ఎటువంటి ఇబ్బందుల్లేకుండా శంబర జాతరను సజావుగా నిర్వహించాలని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర అన్నారు. ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం శంబర దేవస్థానం జాతర గోడపత్రికను ఆయన ఆవిష్క రించారు. శంబర పోలమాంబ దేవస్థానం ఈవో లక్ష్మీనగేష్‌, వైసీపీ సాలూరు మండల అధ్యక్షుడు సువ్వాడ రమణ, పూడి దాలినాయుడు తదితరులు పాల్గొన్నారు. శంబర పోలమాంబ జాతర నిర్వహణ ఏ విధంగా ఉండాలో శుక్రవారం పూర్తి స్థాయిలో స్పష్టత వస్తుందని శంబరపోలమాంబ దేవస్థానం ఈవో లక్ష్మీనగేష్‌ అన్నా రు. ఆయన గురువారం ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. జాతర నిర్వహణ విషయమై గ్రామంలో పెద్దలు, గ్రామస్తుల నుంచి పోలీసులు అభిప్రాయసేకరణ చేపట్టారు. 

మక్కువ: శంబర పోలమాంబ జాతర ఈ నెల 25, 26, 27తేదీల్లో జరగనున్న నేపథ్యంలో కోవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలని సాలూరు సీఐ ఎల్‌.అప్పలనా యుడు అన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో గురువారం విలేఖరులతో సమావే శాన్ని నిర్వహించి మాట్లాడారు. కోవిడ్‌ నిబంధనలు పాటించి భక్తులు అమ్మవారిని ద ర్శించుకోవాలన్నారు. జాతరలో ప్రజలంతా సహకరించి కరోనా వ్యాప్తిని నివారించాలని కోరారు. అనంతరం శంబర పోలమాంబ అమ్మవారి చదురు గుడిలో గ్రామ పెద్దలతో సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ప్రజలు సహకరించాలన్నారు. 


Updated Date - 2021-01-22T05:38:20+05:30 IST