జగన్‌ పతనం ఖాయం

ABN , First Publish Date - 2022-05-18T05:47:06+05:30 IST

వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్‌ పతనం ఖాయమని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ఉపాఽధ్యక్షుడు కోట్ల సూర్యప్రకా్‌షరెడ్డి అన్నారు.

జగన్‌ పతనం ఖాయం
సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకా్‌షరెడ్డి

గడప గడపలో వైసీపీని జనం చీదరించుకుంటున్నారు

ఆర్‌డీఎస్‌, గుండ్రేవుల, వేదవతి, ఎల్లెల్సీ పనులు పూర్తి చేస్తాం 

టమోటా జ్యూస్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం 

కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకా్‌షరెడ్డి 


గోనెగండ్ల, మే 17: వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్‌ పతనం ఖాయమని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ఉపాఽధ్యక్షుడు కోట్ల సూర్యప్రకా్‌షరెడ్డి అన్నారు. మంగళవారం గాజులదిన్నె గ్రామంలో సుంకులాపరమేశ్వరిదేవి దేవరకు ఆయన హాజరయ్యారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకముందు టీడీపీ నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సంక్షేమ పథకాల పేరుతో లక్షల కోట్లు అప్పులు తీసుకువచ్చి రాష్ట్రాన్ని ఆధోగతి పాలు చేశారని విమర్శించారు. మూడేళ్లలో ఏడుసార్లు విద్యుత్‌ చార్జీలు, రెండు సార్లు బస్సు చార్జీలు పెంచి ప్రజలపై పెనుభారం మోపారని అన్నారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను గడప గడప కార్యక్రమంలో ఎమ్మెల్యేలను జనం చీదరించుకుంటున్నారని అన్నారు. వైసీపీ నాయకులను రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మూడేళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదని రైతులపై కపట ప్రేమ ఒలకబోస్తూ ప్రజలను, రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. తన రాజకీయ స్వార్థంకోసం రాయలసీమ ప్రాజెక్టులను తెలంగాణకు తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. టీడీపీ అధికారలోకి వచ్చిన ఏడాది లోపు ఆర్‌డీఎస్‌, గుండ్రేవులు, వేదవతి ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి ఎల్లెల్సీ అండర్‌గ్రౌండ్‌ పైప్‌లైన్‌ ఏర్పాటు చేసి తమ నిజాయితీని నిరూపించుకుంటామని అన్నారు. కర్నూలు పార్లమెంట్‌ ప్రజలు రెండు సార్లు వైసీపీ ఎంపీని గెలిపిస్తే అయితే వారు ఇంతవరకు ప్రజలు కోసం ఏమి చేశారో తెలియదన్నారు. ఈ ప్రాంతంలో పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేసి టమోటా జ్యూస్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కృష్టారెడ్డి, హనుమంతు, జిల్లా టీడీపీ కార్యదర్శి ప్రభాకర్‌నాయుడు, జిల్లా తెలుగు యువత మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ. పరమేశ్వరరెడ్డి, సుధాకర్‌శెట్టి, ఆదెన్న, అల్తాఫ్‌, మాచాని శివకుమార్‌, సర్పంచ్‌ బాషా, చంద్రశేఖర్‌, మాజీ సర్పంచ్‌ రంగముని, మాజీ సర్పంచ్‌ సంజన్న, యాకోబ్‌, మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు రంగస్వామి, తెలుగు యువత నాయకుడు శ్రీనివాసులనాయుడు, రాముడు, లక్ష్మన్న, దరగల మాబు, కౌలుట్లయ్య నాయుడు, చెన్నలరాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-18T05:47:06+05:30 IST