ఒరిగిన చెట్టును నిలబెట్టారు!

ABN , First Publish Date - 2021-05-09T05:14:16+05:30 IST

తమకు నీడనిచ్చే చెట్టు తమ కళ్ల ముందే నేల కూలడాన్ని ఆ యువకులు జీర్ణించుకోలేపోయారు. నేలకూలిన చెట్టుకు తిరిగి ప్రాణం పోశారు.

ఒరిగిన చెట్టును నిలబెట్టారు!
చెట్టును తిరిగి నిలబెడుతున్న యువకులు

చీపురుపల్లి, మే 8:   తమకు నీడనిచ్చే చెట్టు తమ కళ్ల ముందే నేల కూలడాన్ని ఆ యువకులు జీర్ణించుకోలేపోయారు.  నేలకూలిన చెట్టుకు  తిరిగి ప్రాణం పోశారు. చీపురుపల్లి జీవీఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలోని ఓ చెట్టు ఇటీవల ఈదురు గాలులకు నేలకొరిగింది. దీంతో ఆ మైదానంలో వివిధ పోటీలకు సిద్ధమ వుతున్న నిరుద్యోగులు, పట్టణానికి చెందిన ఆశయ సంస్థ సభ్యులు  చెట్టును వేళ్లతో బాటు తిరిగి నిలబెట్టారు. ఎప్పటి లాగే తిరిగి మట్టి, నీరు పోసి దానికి ప్రాణం పోశారు.  దీనిపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

 


 

Updated Date - 2021-05-09T05:14:16+05:30 IST