ప్రస్తుతం ఓటీటీల్లో స్టార్స్ అందరూ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వీరి బాటలోనే సమంత అక్కినేని గత ఏడాది కంటే ముందుగానే ఓటీటీలో అడుగు పెట్టారు. దర్శకులు రాజ్, డీకే తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్'. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ సీజన్ 1 మంచి ఆదరణను దక్కించుకుంది. సీజన్ 2లో సమంత అక్కినేని టెర్రరిస్ట్ పాత్రలో నటించింది. ఈమె పాత్ర ఎలా ఉంటుందోనని అందరి ఆసక్తి నెలకొంది. తాజాగా సంక్రాంతి సందర్భాన్ని పురస్కరించుకుని 'ది ఫ్యామిలీ మేన్ 2' టీజర్‌ను విడుదల చేశారు. మనోజ్ వాజ్పాయ్ భార్య అయిన ప్రియమణి ఫోన్ చేసి 'శ్రీ ఎక్కడున్నావ్, నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు..' అని అంటుంది. మనోజ్ కుమార్తె కూడా 'నీకు, అమ్మకు మద్య ఏదో గొడవ జరుగుతుందని తెలుసు' అని అంటుంది. ఇలా మనోజ్ వాజ్‌పాయి కుటుంబాన్ని, అతని ప్రొఫెషనల్ లైఫ్‌ను ఈ టీజర్లో చూపించారు. టీజర్ చివర్లో సమంత లుక్‌ను రివీల్ చేశారు. సమంత లుక్ చాలా సాదాసీదాగా కనిపిస్తుంది. ట్రైలర్‌ను ఈ నెల 19న విడుదల చేయబోతున్నారు.