Father Risk for Daughters: కూతుళ్ల కోసమే జైలు నుంచి పారిపోయాడు.. 12 ఏళ్ల తర్వాత మళ్లీ కూతుళ్ల కోసమే లొంగిపోయిన ఓ తండ్రి కథ..!

ABN , First Publish Date - 2022-07-26T21:35:43+05:30 IST

పుట్టబోయేది కూతురు అని తెలిస్తే.. అబార్షన్ చేయించే రోజులివి. కొందరైతే.. కూతురు పుడితే తెగ బాధపడిపోతుంటారు. ప్రేమ చూపించకపోగా జీవితాంతం అసహ్యించుకుంటూనే ఉంటారు. ఇలాంటి..

Father Risk for Daughters: కూతుళ్ల కోసమే జైలు నుంచి పారిపోయాడు.. 12 ఏళ్ల తర్వాత మళ్లీ కూతుళ్ల కోసమే లొంగిపోయిన ఓ తండ్రి కథ..!

పుట్టబోయేది కూతురు అని తెలిస్తే.. అబార్షన్ చేయించే రోజులివి. కొందరైతే.. కూతురు (Daughter) పుడితే తెగ బాధపడిపోతుంటారు. ప్రేమ చూపించకపోగా జీవితాంతం అసహ్యించుకుంటూనే ఉంటారు. ఇలాంటి తండ్రులు ఉన్న ఈ కాలంలో కూతుళ్లను కంటికి రెప్పలా కాపాడుకునే తండ్రులు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి.. ఈ కోవకే చెందుతాడు. కూతుళ్ల సంక్షేమం కోసం జైలు (prison) నుంచి పారిపోయాడు. 12ఏళ్ల తర్వాత మళ్లీ కూతుళ్ల కోసమే లొంగిపోయాడు. మహారాష్ట్ర (Maharashtra) లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 


మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన సంజయ్ తేజన్‌ అనే వ్యక్తిని.. 2003లో ఓ హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణ అనంతరం 2005లో సంజయ్‌తో పాటూ అతడి తండ్రి శాలిరామ్, సోదరులు వాసుదేవ్, నామ్‌దేవ్‌లకు కోర్టు (Court) జీవిత ఖైదు విధించింది. ఈ క్రమంలో సంజయ్.. ‌రెండు సార్లు పెరోల్‌పై ఇంటికి వచ్చాడు. 2007లో సంజయ్ దంపతులకు శ్రద్ధ, శృతి అనే ఇద్దరు కవల కుమార్తెలు జన్మించారు. దీంతో తన కుమార్తెల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని శిక్షను రద్దు చేయాలని సంజయ్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అతడి విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. అప్పటి నుంచి రోజూ కూతుళ్ల కోసమే ఆలోచించేవాడు. చివరకు సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

Shocking decision: మీ కూతురు ఎక్కడ అని అడిగితే.. గండె పోటుతో చనిపోయిందని చెప్పండి.. అని లేఖ రాసి.. 15 ఏళ్ల బాలిక చేసిన పని..


తన కూతుళ్లను బాగా చదివించాలనే ఉద్దేశంతో 12ఏళ్ల క్రితం జైలు నుంచి పరారయ్యాడు. కుటుంబానికి దూరంగా ఉంటూనే తరచూ కుటుంబ సభ్యులను కలుస్తూ ఉండేవాడు. పోలీసులు అతడి ఆచూకీ కోసం ఎంత గాలించినా పట్టుకోలేకపోయారు. ఎవరికీ తెలియకుండా బయటి ప్రాంతాల్లో ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేస్తూ.. మరోవైపు పిల్లల సంక్షేమాన్ని కూడా చూసుకునేవాడు. తను ఎక్కడున్నాడనే విషయం ఎవరికీ తెలియకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకునేవాడు. ప్రస్తుతం సంజయ్ కుమార్తెలు పదో తరగతి (10th class) చదువుతున్నారు. ఈ  ఏడాది మేలో పదో తరగతి పరీక్ష ఫలితాలు వచ్చాయి. సంజయ్ కూతుళ్లిద్దరూ 86, 83 శాతం మార్కులతో పాస్ అయ్యారు. దీంతో సంజయ్.. సంతోషంతో ఉప్పొంగిపోయాడు. ఇక తన కూతుళ్ల భవిష్యత్‌కు ఎలాంటి ఢోకా ఉండదనుకున్నాడు.

Bank cash: యువతిని మాటల్లోకి దింపిన యువకుడు.. తిరిగి ఇంటికి వస్తుండగా పాస్‌బుక్ తెరచి చూసిన ఆమెకు..


పరారీలోనే ఉంటే తన కుటుంబానికి ఎక్కడ సమస్యలు ఎదురవుతాయో అని ఆలోచించి.. ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో అతన్ని నాగ్‌పూర్‌లోని సెంట్రల్ జైలుకు తరలించారు. జైలు నుంచి పారిపోవడం వల్ల సెలవులు తదితర ఇతర సౌకర్యాలు తనకు అందకుండా పోతాయని తెలుసని, కానీ కూతుళ్ల సంక్షేమం కోసమే ఇలా చేశానని సంజయ్ తెలిపాడు. ఇదిలావుండగా, పదో తరగతిలో మంచి మార్కులు సాధించినందుకు నాగ్‌పూర్ సెంట్రల్ జైలులోని జైల్ డిపార్ట్‌మెంట్ అలాగే ఎన్జీవోలు సంజయ్ కూతుళ్లను గురువారం సత్కరించారు. కుమార్తెల సంక్షేమం కోసం సంజయ్ చేసిన త్యాగం తెలుసుకుని అంతా అతన్ని అభినందిస్తున్నారు.

woman bus driver: అంత అందగత్తె.. ఇంత గొప్ప బస్ డ్రైవర్.. మొత్తానికి రాష్ట్రంలోనే రికార్డు సృష్టించిందిగా..



Updated Date - 2022-07-26T21:35:43+05:30 IST