తండ్రీ కొడుకులకు గుణపాఠం నేర్పాలి

ABN , First Publish Date - 2021-03-01T04:47:19+05:30 IST

కల్లబొల్లి మాటల తో ప్రజలను మభ్యపెడుతున్న తండ్రీ కొడుకులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుణపాఠం నేర్పాలని బీజేపీ జా తీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.

తండ్రీ కొడుకులకు గుణపాఠం నేర్పాలి
సమావేశంలో మాట్లాడుతున్న డీకే అరుణ

- బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

గద్వాల టౌన్‌, ఫిబ్రవరి 28 : కల్లబొల్లి మాటల తో ప్రజలను మభ్యపెడుతున్న తండ్రీ కొడుకులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుణపాఠం నేర్పాలని బీజేపీ జా తీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్సీ రామచంద్రరావును భారీ మెజార్టీ తో గెలిపించి కేసీఆర్‌, కేటీఆర్‌లకు పట్టభద్రులు చెంపదెబ్బ తినిపించాల్సిన సమయం ఆసన్నమైం దన్నారు. పట్టణంలోని డీకే బంగ్లాలో ఆదివారం నిర్వహించిన జిల్లాస్థాయి పదాధికారుల సమావేశం లో ఆమె పాల్గొని మాట్లాడారు. ఓడిపోయే స్థానం లో సురభి వాణీదేవిని నిలబెట్టి సీఎం తన బండా రాన్ని బట్టబయలు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో పీవీ విగ్రహాన్ని కూల్చివేయాలన్న ఎంఐఎం దోస్తుల గురించి ఏనాడూ నోరు మెదపని కేసీఆర్‌కు ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతో పీవీ కుటుంబం గుర్తుకు రావడం సిగ్గుచేటన్నారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలనే రుచి చూపించి గుణపాఠం నేర్పాలన్నారు. సమా వేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, సీనియర్‌ నాయకుడు గడ్డం కృష్ణారెడ్డి తదిత రులున్నారు. 

Updated Date - 2021-03-01T04:47:19+05:30 IST