సమావేశంలో మాట్లాడుతున్న రమేష్ కుమార్
పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ కుమార్
అచ్యుతాపురం, మార్చి 27 : టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం పండగ వాతావ రణం నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాజాన రమేష్‌కుమార్ తెలిపారు. ఆదివారం అచ్యుతాపురంలో ఆయన విలేఖర్లతో మా ట్లాడుతూ వైసీపీ పాలనపై రాష్ట్ర ప్రజలు విసిగిపో యారన్నారు. అన్నిరంగాల్లో ఆర్థిక భారాలు మో యలేక చంద్రబాబు పాలన కోసం ఎదురు చూస్తు న్నట్టు చెప్పారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం నాడు ప్రతి గ్రామం నుంచి 20 మందికి తక్కువ లేకుండా పార్టీ శ్రేణులతో భారీ బైక్ ర్యాలీ ద్వారా ఎలమంచిలి రావాలని నిర్ణయించామన్నారు ఈ సమావేశంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మిరెడ్డి నాయుడుబాబు (డ్రీమ్స్ నాయుడు), రాజాన నానాజీ, డి.ఎల్లయ్యనాయుడు, లాలం నాగేశ్వరరావు తదతరులు పాల్గొన్నారు.