అత్యాచారం నిందితుడిని శిక్షించాలని ఐద్వా ఆందోళన

Published: Sat, 22 Jan 2022 23:50:36 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అత్యాచారం నిందితుడిని శిక్షించాలని ఐద్వా ఆందోళనదేశపాత్రునిపాలెంలో ఆందోళన చేస్తున్న ఐద్వా కార్యకర్తలు

పరవాడ, జనవరి 22: నక్కపల్లి మండలం రాజయ్యపేటలో 11 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో శనివారం జీవీఎంసీ 79వ వార్డు పరిధి దేశపాత్రునిపాలెంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా మండల కార్యదర్శి పి.మాణిక్యం మాట్లాడుతూ నిందితుడికి ప్రభుత్వం తక్షణమే ఉరిశిక్ష వేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. మహిళల భద్రతకు ప్రత్యేక చట్టాలను తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా ప్రతినిధులు కె.శారద, కె.రాణి, వేణు, ఎం.జ్యోతి, ఎం.భవాని, పి.అనూష తదితరులు పాల్గొన్నారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.