ఐదో విడత పల్లెప్రగతి పనులను చేయలేము

ABN , First Publish Date - 2022-05-20T04:41:14+05:30 IST

ప్రభుత్వం చేపడుతున్న 5వ విడత పల్లెప్రగతి పనులను చేయలేమని మండలంలోని సర్పంచులు గురువారం ఎంపీ డీవో వెంకటేశ్వర్‌రెడ్డికి వినతిపత్రం అందజే శారు. ఈ సందర్బంగా మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు బండెతుకారాం మాట్లా డుతూ గతంలో గ్రామ పంచాయతీల అభివృ ద్ధిలో భాగంగా పనులు చేయించామని వాటికి సంబంధించిన బిల్లులు నేటివరకు అందలేద న్నారు. దీంతో పంచాయతీలకు భారంగా మారిందన్నారు. పారిశుధ్య కార్మికులకు నాలుగు నెలల నుంచి జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉంద న్నారు.

ఐదో విడత పల్లెప్రగతి పనులను చేయలేము
ఎంపీడీవోకు వినతిపత్రం అందజేస్తున్న సర్పంచులు

వాంకిడి, మే 19: ప్రభుత్వం చేపడుతున్న 5వ విడత పల్లెప్రగతి పనులను చేయలేమని మండలంలోని సర్పంచులు గురువారం ఎంపీ డీవో వెంకటేశ్వర్‌రెడ్డికి వినతిపత్రం అందజే శారు. ఈ సందర్బంగా మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు బండెతుకారాం మాట్లా డుతూ గతంలో గ్రామ పంచాయతీల అభివృ ద్ధిలో భాగంగా పనులు చేయించామని వాటికి సంబంధించిన బిల్లులు నేటివరకు అందలేద న్నారు. దీంతో పంచాయతీలకు భారంగా మారిందన్నారు. పారిశుధ్య కార్మికులకు నాలుగు నెలల నుంచి జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉంద న్నారు. పంచాయతీ ట్రాక్టర్‌లను మెయింటెనెన్స్‌ చేయ లేని పరిస్థితి ఉందన్నారు. ఇలాంటి సమయంలో పల్లెప్రగతి పనులను చేయలేమని సర్పంచులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ది పనులకు సంబం ధించిన బిల్లులు చెల్లించి పల్లెప్రగతి పనులపై పునరాలోచించాలని అయన కోరారు. కార్యక్రమంలో మండలంలోని సర్పంచులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-20T04:41:14+05:30 IST