గంటలోపే తుది ఫలితం

ABN , First Publish Date - 2020-10-13T06:57:31+05:30 IST

ముందుగా ఊహించినట్టుగానే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం గంటలోపే వెల్లడైంది.

గంటలోపే తుది ఫలితం

నిజామాబాద్‌ అర్బన్‌, అక్టోబరు 12: ముందుగా ఊహించినట్టుగానే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం గంటలోపే వెల్లడైంది. నగ రంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో సోమవారం ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 6 టేబుళ్లను ఏర్పాటు చేసి 2 రౌండ్ల లో ఓట్లు లెక్కించారు. మొత్తం 823 ఓట్లు పోలవ్వగా 728 ఓట్లను కవిత సాధించారు. బీజేపీ అభ్యర్థికి ఈ ఉప ఎన్నికలో 56 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థికి 29 ఓట్లు వచ్చాయి. ఈ ఉప ఎన్నికలలో 10 ఓట్లు చెల్లలేదు. ఓటు వేసిన వారు నిబంధనలకు అనుగుణంగా వేయకపోవడం వల్ల వాటిని తిరస్కరించారు. కొంత మంది అడ్డగీతలు గీయడం, ఒకరు బ్యా లెట్‌పై సంతకం చేయడం, మరోకరు పార్టీకి జైకొడుతూ స్లోగన్‌ రాయ డం వల్ల వాటిని తిరస్కరించారు. మొదటి రౌండ్‌లో 600 ఓట్లు లెక్కించ గా.. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కవితకు 531 ఓట్లు వచ్చాయి. మిగిలిన 232 ఓట్లను లెక్కించగా అందులోనూ 197 ఓట్లు కవితకు వచ్చాయి.


అలాగే బీజేపీ అభ్యర్థి పోతన్‌కర్‌ లక్ష్మీనారాయణకు 56 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అ భ్యర్థి సుభాష్‌రెడ్డికి 29 ఓట్లు వచ్చాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎన్ని కల పరిశీలకుడు వీర బ్రహ్మయ్య పర్యవేక్షించగా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి పరిశీలించారు. కామారె డ్డి కలెక్టర్‌ శరత్‌తో పాటు అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఓట్ల లెక్కింపు ను పరిశీలించారు. గెలుపొందిన అభ్యర్థి కవితకు ఎన్నిక రిటర్నింగ్‌ అధి కారి నారాయణరెడ్డి ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఓట్ల లెక్కింపు సం దర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు  చేశారు. పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ బందోబస్తును పర్యవేక్షించారు. ఏజెంట్లు, అభ్యర్థులను ఉమెన్స్‌ కళాశాల వైపు నుంచి అనుమతించారు. కంఠేశ్వర్‌ జయశంకర్‌ విగ్రహం వద్ద నుంచే వాహనాలను, ఇతరులను అనుమతించలేదు. ఏసీపీ శ్రీనివాస్‌, ఇతర పోలీసు అధికారులు కాలేజీలో భద్రతను పర్యవేక్షించారు. 


కౌంటింగ్‌ హాల్‌ ముఖం చూడని కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు

ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గట్టి పోటీ ఇస్తారని భావించిన బీజేపీ, కాం గ్రెస్‌ అభ్యర్థులు ఓట్ల లెక్కింపు సందర్భంగా ముఖం చాటేశారు. బీజేపీ అభ్యర్థి పోతన్‌కర్‌ లక్ష్మీనారాయణ, కాంగ్రెస్‌ అభ్యర్థి సుభాష్‌రెడ్డి కనీసం కౌంటింగ్‌ హాల్‌కు రాలేదు. వారి ఏజెంట్లు మాత్రమే హాజరయ్యారు. 


రెండో స్థానంలో  నిలిచిన బీజేపీ

ఈ ఉప ఎన్నికలో బీజేపీ నేతలు అప్రమత్తంగా వ్యవ హరించడం వల్ల రెండో స్థానం లో నిలిచారు. ఎంపీ, జిల్లా నేత ల ఆధ్వర్యంలో క్యాంపు నిర్వహిం చడం వారికి కలిసి వచ్చింది. కొద్ది మంది పార్టీని వీడినా.. మిగతా వారు ఓటు వేయడంతో రెండో స్థానం దక్కిం చుకున్నారు. కాగా.. ఈ ఉప ఎన్నిక ఫలి తాలతో కాంగ్రెస్‌లో నిరాశ నెలకొంది. గెలి చే అవకాశం లేకున్నా ఉన్నవారు కూడా స హకరించకపోవడంతో ఆశ్చర్యానికి గురవుతు న్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 148 మంది కా ంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు ఉండగా.. కేవలం 29 మందే ఓట్లు వేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా రు. నామినేషన్‌ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి  తమ ప్రజాప్రతినిధులు పార్టీ మారుతున్నా సీనియ ర్‌ నేతలు ఆపే ప్రయత్నం చేయలేదు. వారు కలిసిక ట్టుగా ఉండేలా చూడలేదు. ఈ ఫలితంతో పార్టీ శ్రేణు లు మాత్రం డీలా పడ్డారు. సమిష్టిగా పనిచేస్తే బీజేపీ కంటే ఎక్కువ ఓట్లు వచ్చేవని వారు భావిస్తున్నారు.


ప్రజాస్వామ్యం ఓడింది.. పైసలు గెలిచాయి :  మానాల 

అధికార పార్టీ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి ఈ ఎన్ని కల్లో గెలిచిందని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రె డ్డి అన్నారు. ఈ ఓటమితో కాంగ్రెస్‌ పార్టీ కుంగిపోదని కష్టకాలం లో పార్టీకి మద్దతుగా నిలిచిన పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2020-10-13T06:57:31+05:30 IST