‘అగ్నిపథ్‌’ను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-06-28T06:38:56+05:30 IST

సైనికులను భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డీసీసీ అధ్య క్షుడు చెవిటి వెంకన్నయాదవ్‌ అన్నారు.

‘అగ్నిపథ్‌’ను రద్దు చేయాలి
హుజూర్‌నగర్‌లో సత్యాగ్రహ దీక్షలో పాల్గొని ఆర్డీవో వెంకారెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

సూర్యాపేట టౌన్‌, హుజూర్‌నగర్‌ రూరల్‌, కోదాడ, తుంగ తుర్తి, జూన్‌ 27:  సైనికులను భర్తీ చేయడానికి  కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డీసీసీ అధ్య క్షుడు చెవిటి వెంకన్నయాదవ్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్వర్యంలో జిల్లాలోని రెవెన్యూ కార్యాలయ ఎదుట సోమవారం సత్యాగ్రహ దీక్షలు నిర్వహించారు. సూర్యాపేటలోని ఎంజీ రోడ్డు గాంధీ విగ్రహం ఎదుట నిర్వహించిన సత్యాగ్రహ దీక్ష సందర్భంగా ఆయన మాట్లాడారు.  ‘అగ్నిపథ్‌’ను రద్దు చేయాలని కోరారు. అధిష్ఠానం అనుమతి లేకుండా ఇటీవల వడ్డెపల్లి రవిని పార్టీలో చేర్చుకోవడం సరికాదన్నారు.  కార్యక్రమంలో నాయకులు చకిలం రాజేశ్వర్‌రావు, కిరణ్‌యాదవ్‌, బైరు శైలేందర్‌గౌడ్‌, కక్కిరేణి శ్రీనివాస్‌, కోతి గోపాల్‌రెడ్డి, వీరన్ననాయక్‌, తూముల సురేష్‌రావు, కందాల వెంకట్‌రెడ్డి, తంగేళ్ళ కర్ణాకర్‌రెడ్డి, పోలగాని బాలుగౌడ్‌, ఆలేటి మాణిక్యం, నరేందర్‌నాయుడు, మొగదాల లక్ష్మణ్‌గౌడ్‌, శ్రీను, శేఖర్‌, వాసు పాల్గొన్నారు.

- హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తన్నీరు మల్లికార్జున్‌రావు, యరగాని నాగన్నగౌడ్‌, అల్లం ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో  ‘అగ్నిపథ్‌’కు వ్యతిరేకంగా పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వ హించారు. తదనంతరం ఆర్డీవో వెంకారెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్ర మంలో అరుణ్‌కుమార్‌, శ్రావణ్‌, రాము, సైదులు, భూక్యా గోపాల్‌, వెంకటేశ్వర్లు, గురవయ్య, నవీన్‌, మల్లయ్య, సైదా, శివరామ్‌, వెంకటేశ్వర్లు, యలమంద, రామ్మూర్తి, వీరబాబు పాల్గొన్నారు. 

- ‘అగ్నిపథ్‌’ను తీసుకువచ్చి యువతను నిర్వీర్యం చేయడం సరి కాదని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి అన్నారు. ‘అగ్నిపథ్‌’కు వ్యతిరేకంగా కోదాడలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేసి, కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వంగ వీటి రామారావు, కందుల కోటేశ్వరరావు, బాగ్దాద్‌, శ్రీధర్‌ పాల్గొన్నారు. 

-‘అగ్నిపథ్‌’ను రద్దు చేయాలని పీసీసీ సభ్యుడు గుడిపాటి నర్సయ్య, తుంగతుర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్‌ బాలలక్ష్మి అన్నారు. తుంగతుర్తిలో నిర్వహించిన సత్యాగ్రహదీక్షలో వారు  మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ నాయకులు జ్ఞానసుందర్‌, మండలాఽధ్యక్షుడు గోవర్ధన్‌, అను రాధకిషన్‌రావు, వెంకటయ్య, మహేందర్‌  పాల్గొన్నారు.




Updated Date - 2022-06-28T06:38:56+05:30 IST