‘అగ్నిపథ్‌’ను వెనక్కి తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-06-28T04:31:33+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ పథకాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు చిట్టెం అభిజయ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

‘అగ్నిపథ్‌’ను వెనక్కి తీసుకోవాలి
నారాయణపేటలో చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న కాంగ్రెస్‌ నాయకులు

- యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు చిట్టెం అభిజయ్‌రెడ్డి

- కాంగ్రెస్‌ ఆధ ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష 

నారాయణపేట, జూన్‌ 27 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ పథకాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు చిట్టెం అభిజయ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఏఐసీసీ, టీపీసీసీ, డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని పురపార్కు ముందు అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా చిట్టెం అభిజయ్‌రెడ్డి మాట్లాడుతూ దేశాన్ని రక్షించే సైనికులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో తీసుకునేందుకు కేంద్రం అనాలోచితంగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేయాలన్నారు. కేంద్రం దేశ రక్షణను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతుందని ఆరోపించారు. మతాల పేరుతో రెచ్చగొట్టి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తుందని, యు ద్ధానికి సంబంధించిన వివిధ రంగాల్లో ప్రధాని మోదీ ఉద్యోగ నియామకాలను చేపట్టకపోవడంతో దేశంలో సైనికుల సంఖ్య తగ్గిందన్నారు. దేశ రక్షణ విషయంలో కేంద్రం నిర్లక్ష్య వైఖరి కారణంగా దేశానికి ప్రమాదం పొంచి ఉందన్నారు. అగ్నిపథ్‌ పథకంలో ఆరు నెలల శిక్షణ, మూడున్నర ఏళ్ల వరకే సర్వీస్‌ ఉండడంతో యువత నిరాశతో ఉన్నారన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపడితే కాల్పులు చేయ డం సిగ్గు చేటని, వారిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తి వేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ నాయకులు అబ్దుల్‌ సలీం, సర్ఫరాజ్‌ హుస్సెన్‌, శివకుమార్‌, సదా శివారెడ్డి, గౌస్‌, సలీం, నరహరి, బాల్‌రెడ్డి, మోహన్‌, శరణ్‌నాయక్‌, అఖిల్‌రెడ్డి, ఆనంద్‌, ఇర్ఫాన్‌, జలీల్‌, శ్రీనివాస్‌, యూసూఫ్‌ తాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-06-28T04:31:33+05:30 IST