‘అగ్నిపథ్‌’ను ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2022-06-28T05:11:57+05:30 IST

కేంద్ర ప్రభుత్వం సైనికుల నియామకం కోసం తీసుకువచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఒబేదుల్లాకొత్వాల్‌ డిమాండ్‌ చేశారు.

‘అగ్నిపథ్‌’ను ఉపసంహరించుకోవాలి
మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టిన నాయకులు

- డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌

- సత్యాగ్రహ దీక్ష చేపట్టిన కాంగ్రెస్‌

 మహబూబ్‌నగర్‌, జూన్‌27: కేంద్ర ప్రభుత్వం సైనికుల నియామకం కోసం తీసుకువచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఒబేదుల్లాకొత్వాల్‌ డిమాండ్‌ చేశారు.  అగ్నిపథ్‌కు నిరసనగా సోమవారం జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో పార్టీ శ్రేణులు సత్యాగ్రహదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఈ పథకం జైజవాన్‌, జైకిసాన్‌ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్నారు. సైన్యంలో చేరేందుకు నాలుగేళ్ళ కాల పరిమితి అనేది సరైనది కాదని దీనివల్ల యువతలో ఆగ్రహం పెల్లుబీకిందన్నారు. అయినా కేంద్రం మొండి గా ముందుకెళ్లడమనేది సిగ్గుచేటన్నారు. రక్షణ రంగం లో పెట్టుబడిదారులను అనుమతించడం వల్ల దేశ భ ద్రతకు ముప్పువాటిల్లే ప్రమాదం ఉందన్నారు. వెం ట నే ఈ పథకాన్ని రద్దుచేసి పాతపద్ధతిన నియామాకా లు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సంజీవ్‌ ముదిరాజ్‌, వినోద్‌కుమార్‌, ఎన్‌పీ వెంకటేష్‌, బెక్కరి అనిత, సీజే బెనహర్‌, లక్ష్మణ్‌యాదవ్‌, జహీర్‌ అక్తర్‌, మల్లు నర్సింహారెడ్డి, రాములుయాదవ్‌, చంద్ర శేఖర్‌, కంచిమి లక్ష్మణ్‌, వెంకటయ్య, ఖాజా, సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, సుభాష్‌ఖత్రి, వెంకటలక్ష్మి, మనెమ్మ, సహజ తదితరులు పాల్గొన్నారు. 

పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా.. 

 జడ్చర్ల : పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా అగ్ని పథ్‌ పథకాన్ని కేంద్రం తీసుకువచ్చిందని టీపీ సీసీ ఉ పాధ్యక్షులు, మాజీ ఎంపీ డాక్టర్‌ మల్లురవి ఆరోపిం చారు. జడ్చర్ల పట్టణంలోని గాంధీచౌరస్తా వద్ద కాం గ్రెస్‌ పార్టీ జడ్చర్ల నియోజకవర్గ సమన్వయకర్త జ నంపల్లి అనిరుధ్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం అగ్ని పథ్‌ను ఉపసంహరించుకోవాలని సత్యాగ్రహదీక్ష చేప ట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు లకు వ్యతిరేకంగా నల్లచట్టాలు, దేశాన్ని రక్షించే సైనికులకు వ్యతిరేకంగా అగ్నిపథ్‌ పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌షాలు తీసుకువచ్చారని ఆరోపించారు. మానసికంగా, ధైర్యం గా దేశరక్షణ కోసం విధులు నిర్వహించే సైనికులు, సొంత రక్షణ లేదనే ఆవేదనతో విధులు ఎలా నిర్వ ర్తి స్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌పార్టీ జడ్చర్ల నియోజక వర్గ సమన్వయకర్త జనంపల్లి అనిరుధ్‌రెడ్డి మాట్లాడు తూ అగ్నిపథ్‌ను  వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌  నాయకు లు బుర్లవెంకటయ్య, బుక్క వెంకటేశ్‌, నిత్యానందం, మిడ్జిల్‌ ఎంపీపీ కాంతమ్మ, అశోక్‌యాదవ్‌, రబ్బానీ, శ్రీనివాసులు, లక్ష్మమ్మ, సాయిరెడ్డి, నక్కా రాఘవేందర్‌ నియోజకవర్గంలోని పార్టీ నాయకులు పాల్గొన్నారు. 

 అగ్నిపథ్‌ను రద్దు చేయాలి

 దేవరకద్ర: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్ని పథ్‌ను వెంటనే రద్దు చేయాలని టీపీసీసీ కార్యదర్శి జీ మధుసూదన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. టీపీసీసీ పి లుపు మేరకు సోమవారం మండల కేంద్రంలోని పాత బస్టాండ్‌ వద్ద కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సత్యగ్రహ దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ సంయుక్త కార్యద ర్శి  కాటం ప్రధీప్‌కుమార్‌ గౌడ్‌, ఆర్గనైజింగ్‌ సెకట్రరీ కొండ ప్రశాంత్‌ రెడ్డి,  పార్టీ మండల అధ్యక్షుడు రాం దాస్‌, శ్రీనువాసులు, ప్రశాంత్‌కుమార్‌, వివిధ మండ లాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.





Updated Date - 2022-06-28T05:11:57+05:30 IST