‘అగ్నిపథ్‌’ను వెంటనే రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-06-27T05:19:24+05:30 IST

‘అగ్నిపథ్‌’ను వెంటనే రద్దు చేయాలి

‘అగ్నిపథ్‌’ను వెంటనే రద్దు చేయాలి
కడ్తాల: ప్రధాని మోదీ దిష్టి బొమ్మను దహనం చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

  • కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో
  • కడ్తాలలో ప్రధాని మోదీ దిష్టి బొమ్మ దహనం
  • బీజేపీకి వ్యతిరేకంగా భారీ ర్యాలీ 
  • నేడు సత్యాగ్రహ దీక్షలు 


కడ్తాల్‌, జూన్‌ 26: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్‌ ను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో కడ్తాల మండల కేంద్రంలో ఆదివారం పెద్దఎత్తున నిరసన చేపట్టారు. మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు యాట నర్సింహ ఆద్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో కాంగ్రెస్‌, యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ జెండాలతో హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారిపై నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్‌ కూడలిలో దర్నా, రాస్తారోకో చేశారు. ప్రధాని మోదీ దిష్టి బొమ్మను దహనం చేసి బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నేనావత్‌ బీక్యానాయక్‌, మండల కో-ఆప్షన్‌ సభ్యుడు జహంగీర్‌బాబా, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పూల శంకర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాంచందర్‌నాయక్‌, సర్పంచులు సేవ్య బావోజి, రాము నాయక్‌, నాయకులు లక్ష్మణ్‌, ఇమ్రాన్‌బాబా, మల్లేశ్‌గౌడ్‌, హీరాసింగ్‌, మహేశ్‌, రాజేశ్‌, తులసీరామ్‌, బోసు రవి, రాజేందర్‌గౌడ్‌, అంజయ్య పాల్గొన్నారు. 

నేడు సత్యాగ్రహ దీక్షలు 

ఆమనగల్లు/తలకొండపల్లి/చేవెళ్ల/షాద్‌నగర్‌ అర్బన్‌/ఇబ్రహీంపట్నం, జూన్‌ 26: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పిలుపుమేరకు అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నేడు సత్యాగ్రహ దీక్ష నిర్వహించనున్నారు. ఈమేరకు దీక్షాస్థలాన్ని  పార్టీ మండల అధ్యక్షుడు మడ్లీ రాములు పరిశీలించారు. ఈ దీక్షకు ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు వస్పుల మానయ్య, ఖలీల్‌, కృష్ణనాయక్‌, వస్పుల శ్రీశైలం, కొప్పు రాఘవేందర్‌,అలీం, సురేశ్‌, రాజు, శ్రీకాంత్‌, కరీం, మహేశ్‌, గోపాల్‌, రవి, సురేశ్‌, ఫరీద్‌ పాల్గొన్నారు. అదేవిధంగా తలకొండపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో   పార్టీ మండల అధ్యక్షుడు గుజ్జల మహేశ్‌, టీపీసీసీ కిసాన్‌ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి మోహన్‌రెడ్డి మాట్లాడుతూ మండలంలో నేడు నిర్వహించనున్న సత్యాగ్రహదీక్షకు కాంగ్రె్‌సపార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి అంజయ్యగుప్త, నాయకులు దశరథం, యాదయ్య, చెన్నకేశవులు, రవీందర్‌, అజీం, నరేశ్‌, రమేశ్‌ నాయక్‌, వెంకటేశ్‌, బాలకృష్ణ, శ్రీను, సాయినాథ్‌ పాల్గొన్నారు. అదేవిధంగా చేవెళ్లలో పార్టీ నియోజకవర్గం సీనియర్‌ నాయకులు సున్నపు వసంతం సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ.. స్థానిక పోలీ్‌సస్టేషన్‌ ఎదుట మధ్యాహ్నం 1గంటకు సత్యాగ్రహ దీక్ష  చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. అదేవిధంగా షాద్‌నగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు వీర్లపల్లి శంకర్‌ స్థానిక పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. అగ్నిపథ్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ నేడు షాద్‌నగర్‌ చౌరస్తాలో సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. దళితబంధును నిష్పక్షపాతంగా అమలుచేయాలని షాద్‌నగర్‌ పట్టణంలో ర్యాలీ నిర్వహించి, ఆర్డీవోకు వినతిపత్రాన్ని ఇస్తామని వీర్లపల్లి శంకర్‌ తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎల్గనమోని యాదయ్య, బాబర్‌ఖాన్‌, చెంది తరుపతిరెడ్డి, కొంకళ్ళ చెన్నయ్య, సలేంద్రం రాజు, అందె మోహన్‌, ముబారక్‌, ఖదీర్‌, అశోక్‌, సురేష్‌ పాల్గొన్నారు. అదేవిధంగా నేడు ఇబ్రహీంపట్నం చౌరస్తా వద్ద సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నట్లు కాంగ్రెస్‌ నాయకులు చిలుక మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఈదీక్షలో మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పాల్గొంటారని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు అఽధికసంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.

Updated Date - 2022-06-27T05:19:24+05:30 IST