‘అగ్నిపథ్‌’ను కేంద్రం వెనక్కి తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-06-28T04:46:48+05:30 IST

దేశం కోసం ప్రాణమి చ్చే యువతను ప్రైవేటు సైన్యంలా తయారు చేసేందు కు తీసుకువచ్చిన ‘అగ్నిపథ్‌’ను కేంద్రం వెనక్కి తీ సుకోవాలని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ వంశీకృష్ణ అన్నా రు.

‘అగ్నిపథ్‌’ను కేంద్రం వెనక్కి తీసుకోవాలి
సత్యాగ్రహ దీక్ష చేపట్టిన కాంగ్రెస్‌ నాయకులు

- డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ వంశీకృష్ణ


అచ్చంపేటటౌన్‌,జూన్‌ 27: దేశం కోసం ప్రాణమి చ్చే యువతను ప్రైవేటు సైన్యంలా తయారు చేసేందుకు తీసుకువచ్చిన ‘అగ్నిపథ్‌’ను  కేంద్రం వెనక్కి తీ సుకోవాలని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు. అగ్నిపథ్‌కు నిరసనగా సోమవారం పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ధ సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని సి యాచిన్‌, జలాంతర్గాములులాంటి కఠినమైన వాతావర ణ పరిస్థితుల్లోనూ నాలుగేళ్లు యువతతో పని చేయిం చుకొని తర్వాత వారి జీవితాల్ని ఎందుకు పనికిరాకుం డా చేస్తారా అని ప్రశ్నించారు. మోదీ దేశ సైనికులనూ కాంట్రాక్టు వర్కర్లుగా మారుస్తారన్నారు. సైనికులకు పెన్షన్‌ ఇల్వాల్సి వస్తుందని, ప్రాణమిచ్చే సైనికులకు ఎ క్కువ జీతాలు ఇవ్వాల్సి వస్తుందని ఇలాంటి పనికిరాని వాటిని తీసుకు వస్తున్నారన్నారు. దేశ పటిష్ట రక్షణకు ఇంకా లక్షన్నర మంది సైనికులు అవసరం ఉండగా, యువతకు మరిన్ని అవకాశాలివ్వాల్సింది పోయి అన్నీ పరీక్షలు పాసై కేవలం రాత పరీక్ష ఒక్కటి పాసైతే సై న్యంలో చేరుతారనగా మూడేళ్ల తర్వాత పరీక్ష రద్దు చే యడం న్యాయమా అన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేం ద్ర ప్రభుత్వం దిగివచ్చి అగ్నిపథ్‌ను వెంటనే రద్ధు చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామన్నారు. నాయకులు చత్రునాయక్‌, రామనాథం, గౌరిశంకర్‌, వెంకట్‌ రెడ్డి, మహబూ బ్‌అలీ, అజయ్‌   పాల్గొన్నారు. 

 


రద్దు చేయాలి

కొల్లాపూర్‌: కేంద్ర ప్ర భుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ పథకాన్ని వెం టనే రద్దు చేయాలని కాంగ్రెస్‌ నియోజకవర్గ నాయకులు చింతలపల్లి జగదీశ్వర్‌రావు  డిమాం డ్‌ చేశారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, అధి నాయకులు రాహుల్‌గాంధీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవం త్‌రెడ్డిల ఆదేశాల మేరకు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో అగ్నిప థ్‌ పథకాన్ని రద్దు చేయాలని కోరుతూ సోమవారం కొల్లాపూర్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద సత్రాగ్రహ దీక్ష నిర్వహించారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి సత్యాగ్ర హ దీక్షాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్‌ నియోజకవర్గ నాయకులు చింతలపల్లి జగదీశ్వర్‌రావు, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ కేతూరి వెంకటేశ్‌, టీపీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రంగినేని జగదీశ్వరుడు, ఓబీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకునమోని రాముయాద వ్‌, కొల్లాపూర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సత్యగ్రహ దీక్షను కొనసాగించారు. టీపీసీసీ రాష్ట్ర మహిళా కార్యదర్శి కాటమోని తిరుపతమ్మగౌడ్‌, బీబ్లాక్‌ అధ్యక్షుడు కాటమోని కృష్ణయ్య, జిల్లా కార్యదర్శి కంటె శివన్న, మండల అధ్యక్షుడు పరుశరామ్‌నాయుడు, సేవాదల్‌ అధ్యక్షుడు సిరాజ్‌ కార్యదర్శి రఫీయోద్దీన్‌, రేవంత్‌ మిత్ర మండలి అధ్యక్షుడు డీకే మాదిగ, వనపర్తి జిల్లా కాంగ్రెస్‌ కార్యదర్శి బుసిరెడ్డిపల్లి కృష్ణ, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దాసరి ఉదయ్‌యాదవ్‌, యూత్‌ మండల ప్రధాన కార్యదర్శి శివప్రసాద్‌, కొల్లాపూర్‌ కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు కాంతారావు, ఎల్లూరు గ్రామ వార్డు మెంబరు, పార్టీ అధ్యక్షుడు పరుశరామ్‌, నాయకులు శివానందం, సంపంగి నర్సింహ, పుట్టపాగ రాములు, శీలం వెంకటేశ్‌, వివిధ మండల కాంగ్రెస్‌ నాయకులు, యువజన కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-06-28T04:46:48+05:30 IST