అగ్నిపథ్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-06-28T05:38:45+05:30 IST

కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ పథకాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీ బల్మూరి వెంకట్‌ డిమాండ్‌ చేశారు.

అగ్నిపథ్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలి
హుజూరాబాద్‌లో అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న బల్మూరి వెంకట్‌

 ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌

హుజూరాబాద్‌, జూన్‌ 27: కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ పథకాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీ బల్మూరి వెంకట్‌ డిమాండ్‌ చేశారు. అగ్నిపథ్‌ను రద్దు చేయాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం హుజూరాబాద్‌లో అంబేద్కర్‌ చౌరస్తా వద్ద సత్యగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్‌ మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి రైతులను ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. రైతుల ఇబ్బందులు ప్రధానమంత్రికి దృష్టి కళ్లరా చూస్తే తప్ప నల్ల వ్యవసాయ చట్టాలు రద్దు కాలేదన్నారు. అలాంటి నిరుద్యోగ యువత దేశ భద్రత కోసం ఆర్మీలో చేరాలంటే లేనిపోని చట్టాలను తీసుకొచ్చి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతుందన్నారు. వెంటనే అగ్నిపథ్‌ను రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలన్నారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కిసాన్‌సెల్‌ జిల్లా అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సొల్లు బాబు, కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడు కొల్లూరి కిరణ్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-28T05:38:45+05:30 IST