తొలి ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ ఏసీ బస్సు!

ABN , First Publish Date - 2022-08-19T06:23:10+05:30 IST

ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ అశోక్‌ లేల్యాండ్‌ అనుబంధ కంపెనీ స్విచ్‌ మొబిలిటీ దేశంలో తొలి ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ ఏసీ బస్సును అందుబాటులోకి..

తొలి ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ ఏసీ బస్సు!

ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే 250 కి.మీ. ప్రయాణం


ముంబై, ఆగస్టు 18: ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ అశోక్‌ లేల్యాండ్‌ అనుబంధ కంపెనీ స్విచ్‌ మొబిలిటీ దేశంలో తొలి ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ ఏసీ బస్సును అందుబాటులోకి తెచ్చింది. గురువారం ముంబైలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ బస్సును ప్రారంభించారు. డబుల్‌ డెక్కర్‌ ఏసీ బస్సుతో పాటు మరో ఎలక్ట్రిక్‌ బస్సును కూడా మంత్రి ప్రారంభించారు. ఈ బస్సులను ‘బృహన్‌ముంబై ఎలక్ట్రిక్‌ సప్లై అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ (బెస్ట్‌)’ సంస్థ కొనుగోలు చేసింది. ఈ బస్సు ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 250 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని స్విచ్‌ మొబిలిటీ ఇండియా సీఈవో మహేశ్‌ బాబు చెప్పారు.  





Updated Date - 2022-08-19T06:23:10+05:30 IST