T20 World Cup 2022: షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ తొలి పోరు ఎప్పుడంటే..!

ABN , First Publish Date - 2022-01-21T14:40:04+05:30 IST

ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్‌ 2022 షెడ్యూల్‌ వచ్చేసింది.

T20 World Cup 2022: షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ తొలి పోరు ఎప్పుడంటే..!

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్‌ 2022 షెడ్యూల్‌ వచ్చేసింది. తాజాగా ఐసీసీ ఈ టోర్నీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 13 వరకు టోర్నీ జరగనుంది. 16 నుంచి 21 వరకు ఫస్ట్ రౌండ్(క్వాలిఫైయింగ్) మ్యాచులు జరగుతాయి. అసలు మ్యాచ్‌లు అక్టోబర్ 22 నుంచి ప్రారంభమవుతాయి. అక్టోబర్ 22న తొలి మ్యాచ్‌లో గతేడాది టీ20 వరల్డ్‌కప్ చాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో తలపడుతుంది. ఇక గ్రూప్‌-2 సూపర్‌ 12 స్టేజ్‌లో భారత్‌ తలపడనుంది. అక్టోబర్‌ 23న తొలిపోరులో దాయాది పాకిస్థాన్‌ను టీమిండియా ఢీకొనబోతోంది. కాగా, గ్రూప్‌-2లో భారత్‌తో పాటు పాకిస్థాన్‌, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌ ఉన్నాయి. ఇక నవంబర్‌ 9న సిడ్నీ వేదికగా తొలి సెమీఫైనల్‌ ఉంటే.. నవంబర్‌ 10న అడిలైడ్ వేదికగా రెండో సెమీస్‌ ఉంటుంది. నవంబర్‌ 13న మెల్‌బోర్న్‌ వేదికగా ఫైనల్‌ జరగనుంది. 2007 నుంచి ఇప్పటివరకు మొత్తం 7 టీ20 ప్రపంచకప్ టోర్నీలు జరిగాయి. తొలి టీ20 వరల్డ్‌కప్‌ను ధోనీ సారథ్యంలోని భారత్ గెలుచుకుంది. ఆ తర్వాత వెస్టిండీస్ రెండుసార్లు, పాకిస్థాన్, ఇంగ్లండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా చెరోసారి విజేతలుగా నిలిచాయి. 



Updated Date - 2022-01-21T14:40:04+05:30 IST