ఫోర్‌లేన్‌ బ్రిడ్జి డిజైన్‌ మార్చాలి

ABN , First Publish Date - 2022-01-29T03:39:20+05:30 IST

నాలుగు వరుసల రోడ్డు పనుల్లో భాగంగా ఐబీలో నిర్మిస్తున్న బ్రిడ్జి డిజైన్‌ మార్చాలని స్థానికులు పనులను అడ్డుకున్నారు. శుక్ర వారం బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించగా ప్రజాప్రతినిధులు, ప్రజలు అడ్డుకున్నారు. అధికారులు వచ్చి తమతో మాట్లాడిన తర్వాతనే పనులను చేపట్టాలని తెలిపారు.

ఫోర్‌లేన్‌ బ్రిడ్జి డిజైన్‌ మార్చాలి
హైవే అధికారులతో మాట్లాడుతున్న ప్రజాప్రతినిధులు

తాండూర్‌, జనవరి 28: నాలుగు వరుసల రోడ్డు పనుల్లో భాగంగా ఐబీలో నిర్మిస్తున్న బ్రిడ్జి డిజైన్‌ మార్చాలని స్థానికులు పనులను అడ్డుకున్నారు. శుక్ర వారం బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించగా ప్రజాప్రతినిధులు, ప్రజలు అడ్డుకున్నారు.  అధికారులు వచ్చి తమతో మాట్లాడిన తర్వాతనే పనులను చేపట్టాలని తెలిపారు. దీంతో హైవే తెలంగాణ రీజియన్‌ ఇన్‌చార్జి కృష్ణప్రసా ద్‌రావు అక్కడకు చేరుకుని ప్రజాప్రతినిధులతో చర్చించారు. ఫ్లై ఓవర్‌ వంతెన కుదరకుంటే ఐబీలో రాకపోకలకు రెండు మూడు చోట్ల కాలినడకకు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పుడు నిర్మిస్తున్న అండర్‌పాస్‌ వల్ల కేవలం ఒకటే కాలమ్‌ ఇస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడతారని, రాకపోకలకు కష్టం అవుతుందని  ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. 

Updated Date - 2022-01-29T03:39:20+05:30 IST