యోధుల త్యాగంతోనే దేశానికి స్వాతంత్య్రం

ABN , First Publish Date - 2022-08-09T05:36:34+05:30 IST

దేశ స్వాంత్య్రం కోసం సుదీర్ఘ పోరాటం, ఎంతోమంది యోధుల త్యాగాలతో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని, వారందరి జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు.

యోధుల త్యాగంతోనే దేశానికి స్వాతంత్య్రం
హైదరాబాద్‌లో వజ్రోత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్‌, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు

  చేనేత కార్మికులకు నేతన్న బీమా

  14నుంచి అమలు : ప్రభుత్వ విప్‌ సునీత

యాదగిరిగుట్ట రూరల్‌/ ఆలేరు, ఆగస్టు 8: దేశ స్వాంత్య్రం కోసం సుదీర్ఘ పోరాటం, ఎంతోమంది యోధుల త్యాగాలతో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని, వారందరి జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో జరిగిన 75 వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఆలేరు నియోజకవర్గం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విప్‌ మాట్లాడుతూ ప్రతి ఇంటా జాతీయ జెండాను ఎగురవేసి దేశ కీర్తిని చాటాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నేతన్నల సంక్షేమం కోసం బీమా పథకం ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌కె దక్కిందని చెప్పారు. రైతు బీమా తరహాలో నేతన్నలకు బీమా పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు.  ఏదేని కారణంతో మరణిస్తే నేతన్న కుటుంబానికి బాసటగా నిలవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రవేశపెట్టిన ఈ బీమా పథకాన్ని త్వరలో మంత్రి కేటీఆర్‌ ఈ పథకాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఈ పథకం ఈ నెల 14 నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. ఈపథకానికి ప్రభుత్వం రూ.50కోట్లు ప్రకటించి రూ.25కోట్లు విడుదతల చేసిందని తెలిపారు. సుమారు 80వేల మంది నేతన్నలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. 18 నుంచి 59 ఏళ్ల వయస్సు కలిగిన వారికి బీమా వర్తింస్తుందని తెలిపారు. ఎల్‌ఐసీ ద్వారా అమలయ్యే ఈ పథకం కింద లబ్ధిదారుడికి ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ బీకునాయక్‌, ఆలేరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌, గుట్ట, ఆలేరు మున్సిపల్‌ చైర్‌పర్సన్లు ఎరుకల సుధాహేమేందర్‌గౌడ్‌, వస్పరి శంకరయ్య, జడ్పీటీసీలు తోటకూరి అనురాధబీరయ్య, లక్ష్మీ, పల్లా వెంకట్‌రెడ్డి, ఎంపీపీ భూక్య సుశీల, సుధీర్‌రెడ్డి, అమరావతిరెడ్డి, జడ్పీ సీవో ఖలీల్‌ పాల్గొన్నారు.  


Updated Date - 2022-08-09T05:36:34+05:30 IST