భవిష్యత్తు తెలుగుదేశం పార్టీదే

Sep 21 2021 @ 00:54AM
పాయకరావుపేట మండలంలో గెలుపొందిన టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థుల అభినందనలో అనిత

 


తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత

పాయకరావుపేట, సెప్టెంబరు 20: రానున్న రోజులు తెలుగుదేశం పార్టీవేనని తెలుగు మహిళ రాష్ట్ర అధ్య క్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత అన్నారు. పాయకరావుపేటలో  టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు పెదిరెడ్డి చిట్టిబాబు ఆధ్వర్యంలో సోమవారం ఇక్కడ ఏర్పాటైన కార్యకర్తల సమావే శంలో మాట్లాడారు. వైసీపీ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలకు నిరసనగా టీడీపీ అధిష్టానం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించిందన్నారు. దీంతో ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ప్రజలను ఓట్లు అడగనప్పటికీ టీడీపీపై ఉన్న అభిమానం, చంద్రబాబునాయు డిపై ఉన్న నమ్మకంతోనే పలుచోట్ల తమ పార్టీ అభ్యర్థులను గెలిపించారన్నారు. టీడీపీ వదిలేయడం వల్ల వచ్చిన మెజా ర్టీతోనే వైసీపీ అభ్యర్థులు గెలిచారన్న వాస్తవాన్ని ఆ పార్టీ నాయకులు తెలుసు కోవాలని హితవు పలికారు. పార్టీ నాయ కులు పెదిరెడ్డి శ్రీను, వంకా వెంకటర మణ, బొంది కాశీవిశ్వనాథం, కంకి పాటి వెంకటేశ్వరరావు, నాగం బుల్లిదొర, చిక్కా ల శ్రీనివాసరావు, చింతకాయల రాం బాబు, మలిపెద్ది వెంకటరమణతో పాటు గెలుపొందిన ఎంపీటీసీలు  పాల్గొన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.